Balakrishna: Chiranjeevi: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఐదు కోట్లు ఏమయ్యాయి? వీళ్ల షూటింగ్ ఆరాటం దాని కోసమే! – nandamuri balakrishna controversial comments on chiranjeevi and maa association


నందమూరి బాలకృష్ణ మరోసారి బ్లాస్ట్ అయ్యారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలతో జరిపిన చర్చలకు తనను ఆహ్వానించకపోవడంపై ఫైర్ అయిన బాలయ్య మరోమారు ఇండస్ట్రీ గుట్టు బయటపెట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం వసూలు చేసిన డబ్బుకి సంబంధించిన వివరాలతో పాటు.. ఇండస్ట్రీకి సంబంధించిన చర్చల్లో తాను ఎందుకు ఇన్వాల్ కావడంలేదో వివరణ ఇస్తూ సంచలన విషయాలను బయటపెట్టారు.

ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ముక్కుసూటిగా చెప్తున్నా.. నేను ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ కాను.. ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూలో చాలామంది నాపై కామెంట్ చేశారు.. బాలకృష్ణ అన్నింటిలోనూ ఇన్వాల్వ్ కాడు అని.. అవును!! ఇన్వాల్వ్ కాను. అనవరసమైన వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి.. వచ్చి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి?? మన దగ్గర హిపోక్రసీ, సైకో ఫ్యాన్స్ ఎక్కువ. బయట కూడా ఉంది కాని.. నాకైతే ఎక్కువ ఉంది. మిగతావాళ్ల సంగతి పక్కనపెట్టండి.. వాళ్లను నేను లెక్కచేయను కాని.. నాకు ఉన్నంతగా మరెవరికీ లేదు హిపోక్రసీ, సైకో ఫ్యాన్స్. కాళ్ల మీద పడటాలు నాకు చాలా ఎక్కువ. అంటే ఇది ఆరా లాంటిది. అందరికీ రాదు. నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు.. ఇలాంటిది కావాలనుకున్నా ఎవడికీ రాదు. నువ్వు ఎవర్ని ప్రేమిస్తున్నావ్ అంటే.. ఫస్ట్ నా తల్లిదండ్రుల తరువాత.. నన్నునేనే అంటాను నేను. దాని తరువాత ఎవర్ని ప్రేమిస్తున్నావ్ అంటే.. వేళ్లపై లెక్కపెట్టి చెప్పొచ్చు. నేను ఏం చేసినా ఒక ఆరాలా నా చుట్టూ జనం ఉంటారు.

Read Also: ‘సర్కార్ వారి పాట’.. హీరోయిన్ మళ్లీ ఆమేనా? ఎందుకో అర్థమౌతోందా?

ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కడుతున్నారు. నిధుల కోసం అమెరికా వెళ్లారు.. నన్ను పిలిచారా? చిరంజీవి గారితో వీళ్లంతా కలిసి అమెరికా వెళ్లారు.. డల్లాస్‌లో ఫంక్షన్ అన్నారు.. 5 కోట్లు అన్నారు. అవి ఏమయ్యాయి? ఏంటి లాంటి వాటిలో నేను ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే.. ఆర్టిస్ట్ అనేవాడు ఫ్లవర్ మాదిరిగానే ఉండాలి. ఈలేనిపోని తలనొప్పులు ఎందుకు.. పైగా కాని పనికోసం ఎందుకు కూర్చోవడం.

ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ బిల్డింగ్ కట్టారా?? ఇక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్‌గానే ఉంది. ఈరోజు అడిగితే రెండు మూడు ఎకరాలు ఇవ్వరా?? ఎంత టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి? మరి ఎందుకు సినిమా షూటింగ్‌లు తొందరగా మొదలుపెట్టాలన్న ఆరాటం అంటే.. టాక్స్‌ల కోసం కాదా?? డబ్బు వస్తుందని ఆశ. ఇంతవరకూ బిల్డింగ్ కట్టలేదు. అయినా వాళ్లను అడిగేది ఏంటి..? డబ్బులు పెట్టి మేం కట్టుకోలేమా?? అలాంటి ఆలోచనలు రావు. ముందు ఐదు కోట్లు అన్నారు.. ఇప్పుడు ఆ ఐదు ఒకటి అయ్యింది. మిగతా నాలుగు కోట్లు ఏమయ్యాయి?? ఇవన్నింటి కోసం ఎవడు కూర్చుంటాడు. మేమేమైనా లెక్కల మాస్టర్‌లమా?? అందుకే నేను కలగజేసుకోవడం లేదు. హిపోక్రసీ, సైకో ఫ్యాన్స్ ఎక్కువ.. మైక్‌లు చూడగానే పిచ్చెక్కుతుంది కొంతమందికి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు నందమూరి బాలకృష్ణ.

Read Also: రేయ్.. నువ్ కడుపు చేస్తావా? నీ ముఖం అద్దంలో చూసుకున్నావా గజ్జినా**: శివాలెత్తిన శ్రీరెడ్డిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *