Balakrishna Interview: ఇండస్ట్రీ అంటే మాయ.. నన్ను వేరుగా చూస్తే తిక్కరేగుతుంది: బాలకృష్ణ – hypocrisy, psycho fancy; nandamuri balakrishna sensational comments on telugu film industry once again


గడిచిన నాలుగైదు రోజుల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. దీనికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై ఆయన చేసిన సంచలన కామెంట్స్. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినిమా పెద్దలు అందరూ కలిసి చర్చలు జరపడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారంతా కలవడం తనకు తెలీదని బాలకృష్ణ అన్నారు. అలాగే, ఆ చర్చలకు తనను ఎవరూ పిలవలేదని చెప్పారు. అంతేకాకుండా, ‘అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా’ అని సంచలన కామెంట్ చేశారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు కాస్త ఘాటుగానే స్పందించారు. బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, బాలకృష్ణ మాత్రం నాగబాబు వ్యాఖ్యలపై స్పందించలేదు. అయితే, ఈ విషయంలో బాలకృష్ణకు ఇండస్ట్రీ నుంచి బాగానే సపోర్ట్ వచ్చింది. ఇక బాలకృష్ణ అభిమానులు అయితే సోషల్ మీడియా ద్వారా నాగబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే, ఈ విషయంపై బాలకృష్ణ మరోసారి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Also Read:సమంతకు షాక్.. సోషల్ మీడియాలో డిగ్రీ సర్టిఫికెట్

ఈ మధ్య ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువగా గొడవలు అవుతున్నాయి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘‘నేను దేనిలో ఇన్వాల్వ్ కాను. నిన్న మొన్న జరిగిన విషయాల్లో చాలా మంది నాపై కామెంట్లు చేశారు. బాలకృష్ణ ఎందులో ఇన్వాల్వ్ కాడు అన్నారు. అవును.. ఇన్వాల్వ్ కాను. అనవసరమైన విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఇండస్ట్రీలో హిప్పోక్రసీ, సైకో ఫ్యాన్సీ ఎక్కువ. బయట కూడా ఉంది. ప్రత్యేకంగా నాకు ఎక్కువ ఉంది. మిగతావాళ్ల సంగతి పక్కనపెట్టండి.. నేను లెక్కచేయను. నాకున్నంత ఎవరికీ లేదు సైకో ఫ్యాన్సీ. కాళ్ల మీద పడటాలు లాంటివి నాకు ఎక్కువ’’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

అయితే, ఇండస్ట్రీలో తనను ఏ కార్యక్రమానికీ పిలవకపోవడం గురించి కూడా ఆయన స్పందించారు. ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కడుతున్నారు. ఫండ్ రైజింగ్ కోసం అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవి గారు అందరూ కలిసి వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. రూ.5 కోట్లన్నారు. వాటన్నిటిలో నేను ఇన్వాల్వ్ కాను. ఆర్టిస్ట్ అంటే ఒక ఫ్లవర్. బ్లాసమ్, ఫ్రాగ్రెన్స్, బ్యూటీ ఉండాలి. ఇవెందుకండి ఈ తలనొప్పులు. కాని పనికి ఎందుకు వెళ్లి కూర్చోవడం’’ అని బాలకృష్ణ అగ్రెసివ్‌గా చెప్పారు.

Also Read:ఆర్థిక ఇబ్బందులపై స్పందించిన సీనియర్ నటి రాశి

ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ పని పూర్తికాకపోవడంపై కూడా బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ ప్రభుత్వం మాకు సపోర్ట్‌గా ఉంది అంటున్నారు. అడిగితే, రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఈరోజు ఇండస్ట్రీ నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. కరోనాను పక్కనపెట్టి ఈరోజు ఎందుకు సినిమా షూటింగ్‌లు తొందరగా మొదలుపెట్టాలని ఆరాటం. కారణం ట్యాక్సులు.. డబ్బు. ట్యాక్స్ ఎక్కువగా చెల్లిస్తోన్న ఇండస్ట్రీ మాది. అలాంటిది.. ఒక వెధవ బిల్డింగ్ ఇప్పటి వరకు కట్టలేదు. ఏం మేం డబ్బు పెట్టుకుని మేం కట్టుకోలేమా? ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు.. రూ.5 కోట్లన్నారు. ఐదు కాస్త ఒకటయ్యింది. మిగతా నాలుగు కోట్లు ఏమయ్యాయి? ఇవన్నీ మాకు ఎందుకండి. మేం ఏమైనా లెక్కల మాస్టర్లమా? అందుకే నేను కలుగజేసుకోను’’ అని కుండ బద్దలు కొట్టారు బాలయ్య.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *