banana tea: నిద్రలేమి సమస్య? అరటి పండ్ల టీ తాగండి.. ఇలా తయారు చేయండి – how to make banana tea for insomnia


నిద్రలేమి సమస్య నరకాన్ని చూపుతోంది. జీవితాన్ని భారంగా మార్చేస్తుంది. కళ్లకు సరైన నిద్రలేకపోతే చాలా అలసటగా ఉంటుంది. దీంతో చాలమంది నిద్రమాత్రలు వేసుకుంటారు. కానీ, అవి అలవాటుగా మారితే స్లో పాయిజన్‌లా జీవితాన్ని బలితీసుకుంటాయి. నిద్రలేమి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇది క్రమేనా ఆందోళన, కుంగుబాటులోకి దించేస్తుంది.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వివరాల ప్రకారం.. అమెరికన్లపై జరిపిన పరిశోధనల్లో 30-40 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని, వీరిలో పెద్దవాళ్ల సంఖ్య 10-15 శాతం ఉందని తేలింది. నిద్రలేమికి మానసిక సమస్యలే కాకుండా.. ఎన్నో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు, ఎత్తైన ప్రాంతాల్లో నివసించేవారు, తీవ్రమైన వేడి లేదా చల్లని ప్రాంతాల్లో ఉండేవారు, జెట్ లాగ్ సమస్యతో చాలామంది సరిగా నిద్రపోవడం లేదని తెలిసింది. ఈ పరిస్థితిని ‘సిర్కాడియన్ రిథమ్’ అంటారు.

ఇవి కాకుండా బైపోలార్ డిజార్డర్, నిరాశ, ఆందోళన, మానసిక రుగ్మతలు కూడా ప్రధానంగా నిద్రపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా నిద్రలేమిని ఎదుర్కొంటారు. ఆస్తమా, స్లీప్ అప్నియా, పార్కిన్స్, అల్జీమర్స్, ఆర్థరైటిస్, హైపర్ థైరాయిడిజం, కణుతులు, మెదడు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో కూడా నిద్రలేమి సమస్య ఎక్కువే. ఈ సమస్యలతో బాధపడేవారిలో చాలామంది నిద్రమాత్రలు తీసుకుంటూ ఉంటారు. అయితే, వాటితో అవసరం లేకుండా ఇంట్లోనే సులభమైన పద్ధతిలో ‘బనానా టీ’ తాగి నిద్రలేమి సమస్యను దూరంచేసుకోవచ్చు. అదెలా తయారు చేయాలో చూద్దాం.

Also Read: మిషనరీ భంగిమలో కిక్కెకించే సెక్స్.. ఈ 5 సూత్రాలతో స్వర్గాన్ని చూడొచ్చు!
ఇలా చేయాలి:
✺ ఒకటి లేదా రెండు అరటి పండ్లను తీసుకుని, వాటి తొక్క తీయకుండా వాటి చివర్లు కత్తిరించండి.
✺ అరటి పండ్లను ఒక గిన్నెలో వేసి నీళ్లుపోయండి.
✺ స్టావ్ వెలిగించి ఆ గిన్నెలో అరటి పండ్లు మగ్గే వరకు నీటిని 10 నిమిషాలు మరిగించండి.
✺ తర్వాత ఆ నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలపండి. అంతే.. బనానా టీ రెడీ.
✺ పడుకొనే ముందు దీన్ని తాగినట్లయితే మంచి నిద్ర పడుతుంది.

Also Read: తాటి ముంజులతో ఆరోగ్యం మస్త్.. రోగాలన్నీ మటాష్!

అరటి పండ్ల కొనుగోలులో జాగ్రత్త: ఇటీవల అరటి పండ్లను రసాయానాల్లో ముంచి ముగ్గబెడుతున్నారు. అలాంటి అరటి పండ్లతో టీ చేసే ముందు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. వీలైనంతవరకు సహజ పద్ధతిలో పండే అరటి పండ్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. అరటి పండు, దాని తొక్కలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కని నిద్ర అందిస్తాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *