Bank అదిరిపోయే ఆఫర్.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే క్షణాల్లో రుణం!



ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యస్ బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. లోన్ ఇన్ సెకండ్స్ సర్వీసులు లాంచ్ చేసింది. ఇందులో భాగంగా బ్యాంక్‌కు చెందిన కస్టమర్లు సులభంగానే రుణం పొందొచ్చు. అయితే ఈ సౌలభ్యం అందరికీ అందుబాటులో ఉండదు.

బ్యాంక్‌కు చెందిన ప్రిఅప్రూవ్డ్ లయబిలిటీ అకౌంట్ హోల్డర్స్‌‌ రుణన్ని క్షణాల్లో పొందొచ్చు. కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లకుండానే సులభంగానే రుణం పొందటమే లక్ష్యంగా బ్యాంక్ ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ప్రిఅప్రూవ్డ్ రుణం పొందాలని భావించే వారు ఎలాంటి డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు.

Also Read:

ప్రిఅప్రూవ్డ్ ఆఫర్ అందుబాటులో ఉన్న యస్ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లకుండా నెట్ బ్యాంకింగ్ సాయంతో ఈ తరహా రుణాన్ని ఈజీగా పొందొచ్చు. కరోనా వైరస్ సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ సర్వీసుల వల్ల ఊరట కలుగనుంది.

యస్ బ్యాంక్ అర్హత కలిగిన కస్టమర్లకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా లోన్ ఆఫర్‌ గురించి తెలియజేస్తోంది. ఎస్ఎంఎస్ లేదా మెయిల్‌లో లోన్ కోసం అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి సులభంగా రుణం పొందొచ్చు. లోన్ ఎంత కావాలి.. ఎన్ని నెలల్లో తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తారు వంటి వివరాలు ఎంటర్ చేసి తక్షణమే లోన్ తీసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *