bank holidays in may: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే? – bank holidays in andhra pradesh, telangana and across india in may 2020


ప్రధానాంశాలు:

  • మే నెలలో బ్యాంక్ సెలవులు
  • ఒకటో తేదీనే బ్యాంకులు బంద్
  • మే డే సందర్భంగా సెలవు

న‌గ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ నెల (మే)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 9, 23 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే మే నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు 3, 10, 17, 24, 31 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి షాక్!

రెండో శనివారాలు, ఆదివారాల్లో సెలవులు కాకుండా మే నెలలో బ్యాంక్ ఉద్యోగులకు అదనంగా కూడా సెలవు ఉంది. మే 1న శుక్రవారం మే డే సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అలాగ మే 25న రంజాన్ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవు ఉండొచ్చు. కేవలం ఈ రెండు రోజులు మాత్రమే బ్యాంకులకు అదనంగా సెలవులు ఉన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇవే సెలవులు వర్తిస్తాయి.

Also Read: పీఎం కిసాన్ 2020 లిస్ట్: మీకు రూ.6,000 వస్తాయో రావో ఇలా చెక్ చేసుకోండి!

ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *