bank loan: Loan తీసుకునే వారికి శుభవార్త.. ఈ 3 బ్యాంకుల్లో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు! – bank of india, union bank of india and uco bank slashed interest rates on various loans


ప్రధానాంశాలు:

  • రుణ రేట్లలో కోత
  • మూడు బ్యాంకుల నిర్ణయం
  • దీంతో కస్టమర్లకు ప్రయోజనం

లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. బ్యాంకులు వరుసపెట్టి రుణ రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక రెపో రేటు తగ్గించడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో బ్యాంకులు కూడా రుణ రేట్లలో కోత విధిస్తున్నాయి. మూడు బ్యాంకులు రెపో ఆధారిత లెండింగ్ రేట్లను తగ్గించాయి.

బ్యాంకుల రుణ రేట్ల తగ్గింపు కారణంగా కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే ఈఎంఐ భారం దిగిరావొచ్చు. యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు రుణ రేట్లు తగ్గించాయి. దీంతో ఈ మూడు బ్యాంకుల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకునే వారికి కూడా బెనిఫిట్ ఉంటుంది.

Also Read: ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టక్కర్లేదు!

యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువరీ బెంచ్‌మార్క్ లెండింగ్ రెటు (ఈబీఎల్ఆర్)ను 0.40 శాతం తగ్గించాయి. అదేసమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను 0.25 శాతం కోత విధించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లు 6.8 శాతానికి దిగొచ్చాయి. జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.

యూకో బ్యాంక్ రుణ రేట్లు 6.9 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ 0.25 శాతం తగ్గింది. రేట్ల కోత జూన్ 1 నుంచే అమలులోకి వచ్చింది. దీంతో వాహన, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.7 శాతంగా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *