beetroot health benefits: బీట్‌రూట్.. ఈ ఎర్రని దుంప గొప్ప ఔషదం, ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు – health benefits of beetroot


రోగ్యం కావాలా? అయితే, బీట్‌రూట్ తినండి. ఎందుకంటే.. ఇందులో ఎన్నోరకాల ఔషద గుణాలు ఉన్నాయి. ‘బెటా వల్లురీస్’ అనే శాస్త్రీయ నామంతో పిలిచే.. ఈ దుంప ఆకులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. బీట్‌రూట్ యూరప్‌లోని మెడిటరేనియన్‌ ప్రాంతంలో పుట్టింది. ప్రపంచమంతా పాకింది. గత రెండు వేల ఏళ్ల నుంచి దీన్ని ఆహారంగా వాడుతున్నారు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు సైతం వీటిని కూరగాయులుగా వాడారట. వారి నుంచే ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లకు బీట్‌రూట్ చేరిందట. ఇప్పుడు మన దేశంలో కూడా బీట్‌రూట్‌ను విస్తృతంగా సాగుచేస్తున్నారు.

బీట్‌రూట్‌ను కేవలం కూరల్లోనే కాదు. పలు ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు. టేబుల్ షుగర్‌ను సైతం బీట్‌రూట్‌తోనే తయారు చేస్తారు. బీట్‌రూట్‌లోని ‘బటానినిస్’ అనే పదార్ధంతో జామ్, పేస్టు, ఐస్‌క్రీమ్‌లు తయారుచేస్తారు. ఎర్రగా కంటికి ఇంపుగానే కాకుండా.. అంతే గొప్పగా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

బీట్‌రూట్‌ వల్ల కలిగే ప్రయోజనాలు:
❤ బీట్‌రూట్ మలబద్దకాన్ని నివారిస్తుంది.
❤ బీట్‌రూట్‌లోని బోరాన్ లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
❤ బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును నియంత్రిస్తుంది.
❤ ‘అనీమియా’తో బాధపడేవారు రోజూ ఒక కప్పు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా సమస్య నుంచి బయటపడతారు.
❤ డయాబెటిక్ రోగులు బీట్‌రూట్ తీసుకుంటే లివర్‌ సంబంధ సమస్యలు తలెత్తవు.
❤ బీట్‌రూట్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.
❤ బీట్‌రూట్‌లో నైట్రేట్లతోపాటు ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉంటాయి.
❤ కాల్షియాన్ని వినియోగించుకోవడానికి తోడ్పడే సైలీషియా సైతం బీట్‌రూట్‌లో ఉంటుంది.
❤ బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటా సైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.
❤ చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌-బి సైతం బీట్‌రూట్‌‌లో ఉంది.
❤ బీట్‌రూట్ తీసుకుంటే చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేదుకు ఉపయోగపడుతుంది.
❤ బీట్‌రూట్ పెదాలు పొడిబారకుండా కాపాడుతుంది.
❤ బీట్‌రూట్‌లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.
❤ రక్తనాళాలు, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.
❤ గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.
❤ బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తంలో కలిసిన తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల రక్తనాళాలు విప్పారి రక్తపోటు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Read Also: ‘మా బంధువుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా.. కానీ, అతడు నాకు అన్నయ్య…’

మీకు తెలుసా?:
❂ రెండు రోజులపాటు రోజుకి 400 ఎంఎల్ చొప్పున బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
❂ క్రీడాకారులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.

Read Also: తొక్క తీయకుండా అల్లం వాడుతున్నారా? జాగ్రత్త!

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే ఈ కథనం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *