ఐపీఎల్ 2020కి నేను రెడీ: బెన్‌స్టోక్స్ ప్రకటన.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు తాను సిద్ధమని ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడగా.. ఇప్పటికీ భారత్‌లో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీ జరగడంపైనా సందేహాలు నెలకొన్నాయి. కానీ.. ఒకవేళ టోర్నీ జరిగితే..? ఆడేందుకు తనకి ఎలాంటి అభ్యంతరం లేదని బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. 2018 ఆటగాళ్ల వేలంలో బెన్‌స్టోక్స్‌ని రికార్డు స్థాయిలో రూ. 12.5 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.


Read More:
రోహిత్ శర్మతో ఈరోజు పీటర్సన్ ఇంటర్వ్యూ

ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా తర్వాత.. టోర్నీ రీషెడ్యూల్‌పై గత మంగళవారం ఫ్రాంఛైజీలతో చర్చించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావించింది. కానీ.. దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ఇప్పట్లో టోర్నీ జరగడం సందేహమేనని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చిన బీసీసీఐ ఆ మీటింగ్‌ని రద్దు చేసింది. ఇక భారత ప్రభుత్వం కూడా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఆ గడువు ఏప్రిల్ 14 వరకూ ఉండనుంది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

Read More:
ఆపదలో ఉన్నాం హాలిడేస్‌లో కాదు: సచిన్ చురకలు

మార్చి 12 నుంచే పర్యాటక వీసాల్ని భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకూ రద్దు చేయడంతో విదేశీ క్రికెటర్లు అప్పటిలోపు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం లేదు. దీనికి తోడు భారత్‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. కొన్ని దేశాలకి చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌కి దూరంగా ఉండనున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. ఐపీఎల్‌లో ఆడటంపై ఆటగాళ్లదే తుది నిర్ణయమని ప్రకటించింది. కానీ.. కొంత మంది క్రికెటర్లు మాత్రం తాము రిస్క్ తీసుకోలేమని చెప్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *