bezawada gang war: పగబట్టిన ‘పండు’ని తల్లే రెచ్చగొట్టిందా? బెజవాడ్ గ్యాంగ్‌వార్‌లో తవ్వేకొద్దీ సంచలనాలు – shocking facts comes light in bezawada gang war


బెజవాడ గ్యాంగ్ వార్‌లో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అపార్ట్‌మెంట్ సెటిల్‌మెంట్‌కి పిలిచిన సోనాలిక నాగబాబే ఈ వ్యవహారానికి సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వ్యవహారంలో ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. అవి సెటిల్ ‌చేసేందుకు నాగబాబు తనకు పరిచయమైన సందీప్‌ని వాడుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ వద్ద ఎప్పుడూ కుర్రోళ్లు ఉంటుండడంతో అతనిని ఉపయోగించి అపార్ట్‌మెంట్ వ్యవహారం సెటిల్‌ చేయాలని భావించి నాగబాబు ఇద్దరికీ సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకసారి సిట్టింగ్ అయిన తరువాత శ్రీధర్ రెండో సిట్టింగ్‌కి పండుని పిలిచినట్లు తెలుస్తోంది. అతను సిట్టింగ్ స్పాట్‌కి వచ్చిన అనంతరం సందీప్ అక్కడికి రావడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన వద్ద ఉండే పండు తనకు ఎదురుతిరుగుతాడని ఊహించని సందీప్.. తీవ్ర ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. పండు కాలర్ పట్టుకుని హెచ్చరించడంతో అక్కడ ఉన్న వారు విడదీసి పంపేశారు.

పండు ఇంటిపైకి మనుషులు..

samayam telugu

పండు విషయం మనసులో పెట్టుకున్న సందీప్.. అతని ఇంటికి తన మనుషులను పంపించాడు. కొడుకు ఇంట్లో ఉన్నప్పటికీ పండు తల్లి లేడని చెప్పిందని.. వారు వినకపోవడంతో స్థానిక మహిళలతో కలసి కారండబ్బాలు, పూలకుండీలతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో సందీప్ మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అదే విషయమై తల్లీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. సందీప్‌ని చంపాకే ఇంటికి రా అంటూ ఆవేశంలో తల్లి ఆర్డర్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి సందీప్‌ని చంపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: డబ్బున్న అమ్మాయిని ముగ్గులోకి దించి దారుణం.. తల, చేతులు నరికేసి.. ఏడాది తర్వాత వీడిన మిస్టరీ

గంజాయి బ్యాచ్‌లతో దోస్తీ..

samayam telugu

పండుకి గంజాయి బ్యాచ్‌లతో సంబంధాలు ఉండడంతో వారిని ఈ గ్యాంగ్ వార్‌కి వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు విజయవాడ వన్‌టౌన్‌కి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు కూడా పండు వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రౌడీషీటర్లు జైల్లో ఉన్న సమయంలో గంజాయి బ్యాచ్‌లతో పరిచయం పెంచుకుని నగరంలో వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.ఓ రౌడీషీటర్ గంజాయి వ్యాపారంలో బాగానే వెనకేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. వారితో పాటు మరో ఇద్దరు రౌడీషీటర్లతో కూడా సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ఈ వార్‌లో పాల్గొన్నట్లు సమాచారం.

Read Also: ముళ్లపొదల్లో మహిళ మృతదేహం.. ప్రియుడిని పట్టించిన ‘పర్సు’

మరో ముగ్గురు రౌడీషీటర్ల ప్రమేయం?

samayam telugu

గంజాయి మత్తులో ఉన్న పండు బ్యాచ్.. సందీప్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. మత్తు కారణంగానే బలంగా రాళ్లు విసరడం.. కత్తులు తిప్పడం చేసినట్లుగా అనుమానిస్తున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ధాటికి సందీప్ అనుచరులు తట్టుకోలేక పారిపోయారని.. ఆ సమయంలో సందీప్‌ని బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్యాంగ్ వార్ సమయంలో పండుకి పరిచయమున్న రౌడీషీటర్లు కూడా అక్కడే గంజాయి తాగుతూ స్పాట్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరికొన్ని పేర్లు బయటకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: భార్య చెల్లెలిపై కామంతో రెచ్చిపోయిన బావ.. ఆమెకి తెలిసిపోవడంతో..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *