bigg boss 4 telugu: బిగ్ బాస్ నామినేషన్స్‌లో అఖిల్, మోనాల్.. కానీ మిగిలిన నలుగురిలోనే ఎలిమినేషన్ – nagarjuna telugu bigg boss season 4 october 26 written updates; 8th week nominations heat


ఏడోవారం దివి ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ షోపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇక సోమవారం నాడు బిగ్ బాస్ హౌస్ మంచి హీట్ మీద ఉండటం కామన్.. ఎందుకూ అంటూ నామినేషన్స్ ప్రక్రియ ఉండటంతో ఎవరు నామినేట్ అవుతారు.. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు?? ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారన్న ఆసక్తితో సోమవారం నాటి 51వ ఎపిసోడ్ ప్రారంభమైంది.


దివి వేసిన బిగ్ బాంబ్‌తో కిచెన్‌లో వంట చేస్తూ కనిపించింది లాస్య. దీని ప్రకారం మూడు పూటలా.. లాస్య మాత్రమే వంట చేయాలి. ఆమెకు అసిస్టెంట్‌గా అభిజిత్‌ని ఏరికోరి తెచ్చుకుంది లాస్య. ఈ ఇద్దరూ మాత్రమే వంట పని చేయాల్సి ఉండగా.. అభిజిత్ తింటూ ఉంటే.. అఖిల్ లాస్యకు సాయం చేస్తూ కనిపించాడు. ఇక అభిజిత్ వారం పాటు మనమే వంట చేయాలి అని అనగా.. మనం ఏది వండితే అదే అనేసింది లాస్య.

ఇక సమంత స్పెషల్ రిక్వెస్ట్‌పై అభిజిత్ వస్తువుల్ని బట్టల్ని తిరిగి ఇచ్చేశారు బిగ్ బాస్. ఈ సందర్భంగా.. నా బట్టలు వచ్చేశాయ్ అంటూ.. సమంతకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు అభి. ఇక రత్తాలు పాటకు ఇంటి సభ్యులు అదిరిపోయే స్టెప్పులు వేశారు.

మార్నింగ్ మస్తీ
మార్నింగ్ మస్తీలో భాగంగా.. తమకు నచ్చిన వ్యక్తి గురించి పాజిటివ్, నెగిటివ్ అంశాలను రాసి వాటిని చదివి వినిపించాలని చెప్పారు బిగ్ బాస్. చాలావరకూ పాజిటివ్‌గానే రాసుకున్నారు కంటెస్టెంట్లు. అభి కోసం అఖిల్ రాయగా.. మెహబూబ్ కోసం మోనాల్ చాలా పాజిటివ్‌గా రాసింది. ఆ తరువాత లాస్య, అరియానా, మోనాల్‌లు బతుకమ్మ ఆడుతుంటే వాళ్లతో జతకలిసి బతుకమ్మ ఆడాడు అవినాష్. ఈ నలుగురూ కెమెరాలో ఫోకస్ కావడానికి ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో బతుకమ్మ ఆడుతూ వారి ప్రయత్నం వాళ్లు చేశారు.

అభి-మోనాల్ మధ్య పుల్ల పెట్టిన లాస్య.. ఈమెకు ఇదేం ఆనందమో
నోయల్, అభి, లాస్య, హారికలు ఎప్పటిలాగే గ్రూప్ డిస్కషన్ పెట్టారు. మోనాల్ గురించి చర్చిస్తూ.. లాస్య నవ్వుతూనే అభి-మోనాల్‌ల మధ్య పుల్ల పెట్టింది. అందరి బెడ్ షీట్లు మడత పెట్టి.. నీ బెడ్ షీట్ మడతపెట్టలేదంటే చూడు నువ్వంటే ఎంత స్పెషలో అని చిచ్చు పెట్టింది. ఆమెతో నోయల్ కూడా జతకలిశాడు.

అయితే ఆమె మడత పెట్టినా కూడా నేను విప్పేసుకుంటా.. నాకు ఫుల్ క్లారిటీ ఉంది ఆ విషయంలో. ఆమెను హేట్ చేయడం లేదు.. ఛీటెడ్ అంటూ అసహ్యించుకున్నాడు అభిజిత్. దీంతో లాస్య కడుపు చల్లబడినట్టుగా తెగ నవ్వుకుంది.

నామినేషన్ ప్రక్రియ.. హాట్ హాట్‌గా
ప్రతివారం మాదిరే ఈవారం కూడా నామినేషన్స్ పక్రియను చేపట్టారు బిగ్ బాస్. హౌస్‌లో మిగిలిన 11 మంది సభ్యులు ఈ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్నారు. బిగ్ బాస్ ప్రయాణంలో ఏ సభ్యుడి వల్లన్నైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. లేదంటే ఇక ముందు పనాలా వ్యక్తితో ఇబ్బందులు ఎదురౌతాయని భావిస్తున్నా.. వాళ్ల పేర్లు చెప్పి అందుకు గల కారణాలు చెప్పి.. ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ల ఫొటోలు ఉన్న ప్లేట్స్‌ని సుత్తితో పగల గొట్టి నామినేట్ చేయాలని కోరారు బిగ్ బాస్. అయితే ఇంటికి కెప్టెన్‌గా ఉన్న అవినాష్‌కి ఈ నామినేషన్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..

✦ లాస్య.. అమ్మా రాజశేఖర్, మోనాల్.

✦ అఖిల్.. అరియానా, అమ్మా రాజశేఖర్.

✦ మెహబూబ్.. అరియానా, మోనాల్

✦ అవినాష్.. లాస్య, హారిక

✦ అమ్మా రాజశేఖర్.. అఖిల్, లాస్య

✦ అరియానా.. మెహబూబ్, అఖిల్

✦ సొహైల్.. అరియానా, రాజశేఖర్ మాస్టర్

✦ నోయల్.. మెహబూబ్, అఖిల్

✦ అభిజిత్.. మోనాల్ గజ్జర్, అమ్మా రాజశేఖర్

✦ హారిక.. అరియానా, మెహబూబ్

✦ మోనాల్ గజ్జర్.. మెహబూబ్, లాస్య

హాట్ హాట్ డిస్కషన్స్..

తనని కన్నింగ్ స్మైల్ అని రాజశేఖర్ అన్నారని.. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడతానని స్టేట్ మెంట్లు ఇవ్వడం నాకు నచ్చలేదని అందుకే రాజశేఖర్ మాస్టర్‌ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది లాస్య.

అలాగే మోనాల్.. మూడ్‌ని బట్టి మారిపోతుందని తనంతట తానే మాట్లాడటం మానేసి నువ్వెందుకు మాట్లాడటం లేదని నన్నే అడుగుతోంది.. ఆమె నాకు అర్థం కావడం లేదు.. అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది లాస్య.

ఇక అమ్మా రాజశేఖర్.. అఖిల్‌ని నామినేట్ చేస్తూ.. మోనాల్ ఇష్యూని లేవనెత్తడంతో రచ్చ రేగింది. అభిజిత్‌తో గొడవైన తరువాత మోనాల్ మాట్లాడటం మానేసినా అఖిల్ మరింత దగ్గర కావడం తనకు నచ్చలేదని రాజశేఖర్ మాస్టర్ అనడంతో.. మోనాల్ కోసం నేను ఇక్కడకు రాలేదు.. మేం ఇద్దరం కలిసి బిగ్ బాస్ హౌస్‌కి రాలేదు. మోనాల్‌తో నేను ఎవరితో మాట్లాడొద్దని చెప్పలేదు.. ఆమె మాట్లాడకపోతే మీకెందుకు అంత ఇది అవుతుందో నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కోసం మేం కొట్లాడుకుని విడిపోలేదు.. రాజశేఖర్ మాస్టర్ రాంగ్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. చాలా చండాలంగా ఉంది. మోనాల్‌ మాట్లాడకపోతే అది ఆమె ఇష్టం.. నేను అభిజిత్‌తో మాట్లాడొద్దని చెప్పానా? అంటూ రాజశేఖర్‌పై ఫైర్ అయ్యాడు అఖిల్.

ఇక కుమార్ నామినేట్ అయ్యి వెళ్లి పోతుంటే.. అతను అఖిల్‌ని కరివేపాకు చూపించాడని.. తెగ ఫీల్ అయిపోయి.. అందుకే నువ్ అక్కడ ఉన్నావ్.. నేను ఇక్కడ ఉన్నా అని చెప్పావ్.. అది కరెక్ట్ కాదు.. నామినేట్ అయిన వారి పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు’ అని అఖిల్‌ని చురకలేస్తూ నామినేట్ చేశారు రాజశేఖర్ మాస్టర్. ఎలిమినేట్ అయిన వాళ్లని సంతోషంగా పంపించాలి.. బాధ పెట్టకూడదని అఖిల్‌కి గట్టిగానే గడ్డిపెట్టాడు రాజశేఖర్ మాస్టర్.

అయితే తనని కొత్తిమీర, కరివేపాకు అంటే ఇలాగే మాట్లాడతా.. ఎలిమినేట్ అయితే ఏదైనా మాట్లాడొచ్చా.. అంటూ మరోసారి తన యాటిట్యూడ్ చూపించాడు అఖిల్. అయితే ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ చాలా హాట్ హాట్ ‌గా సాగింది.

ఇక మోనాల్ గజ్జర్ మరోసారి తన కన్నీటి కుళాయిని ఓపెన్ చేసింది. ఇంట్లో సభ్యులు ఎవరూ మరోసారి అఖిల్, అభిజిత్, మోనాల్ టాపిక్ తేవొద్దని వేడుకుంది. ఇక తాను నాన్ వెజిటేరియన్ అని.. లాస్య వరుసగా మటన్, చికెన్ వండిందని.. అక్కా అని పిలిచి మరీ పన్నీర్ కర్రీ చేయమన్నా చేయలేదని తెగ ఏడ్చేసింది మోనాల్.

మొత్తానికి హాట్ హాట్‌గా సాగిన ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్‌లు నామినేట్ అయ్యారు. ఆ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే మోనాల్-అఖిల్ ఇద్దరూ నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ లేనట్టే లెక్క. ఎలాగూ మోనాల్ జోలికి పోనే పోరూ.. ఇక అఖిల్ లేనిదే మోనాల్ నుంచి మసాలా కంటెంట్ నిల్.. సో బిగ్ బాస్ రేటింగ్ లెక్కల్లో ఈ ఇద్దరూ సేఫ్ కాబట్టి.. మిగిలిన నలుగురు అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్యలకు మాత్రమే నామినేషన్స్ లెక్క. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతాయి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *