Cesarean delivery: మొదటి కాన్పు సిజేరియన్ అయితే, రెండోది నార్మల్ డెలివరీ అవుతుందా.. – hidden truths about c sections delivery


ఒకప్పుడు సిజేరియన్ అంటే విచిత్రంగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే విచిత్రంగా చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళ దగ్గర్నించీ, డాక్టర్ల వరకూ అందరూ సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు. నిజంగా నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ ద్వారా బిడ్డని కనటమే మంచిదా? నిపుణులు ఏమంటున్నారు.

​సిజేరియన్ మంచిదేనా?

samayam telugu

సిజెరియన్ అంటే సర్జరీ ద్వారా బిడ్డని బయటికి తీయడం. ఒకప్పుడు తల్లి ప్రాణానికో, బిడ్డ ప్రాణానికో ముప్పు ఉన్నప్పుడు మాత్రమే చేసే ఈ సర్జరీ ఇప్పుడు నార్మల్ డెలివరీ కంటే నార్మల్ అయిపోయింది. దీనికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ డెలివరీ మీద తల్లికీ, కుటుంబానికీ ఉండే కంట్రోల్. అదే మైనస్ పాయింట్ ఇది యుటెరస్‌ని బలహీన పరుస్తుంది. ఈ కారణంగా తరవాత డెలివరీలు కాంప్లికేట్ అవుతాయి.

Also Read : ఉల్లిపాయలు లైంగిక శక్తిని పెంచుతాయా? పచ్చివి తినొచ్చా? ప్రయోజనాలేమిటీ?

​నార్మల్ డెలివరీకి, సిజేయరియన్‌కి తేడా..

samayam telugu

నిజానికీ నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీకి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ, నార్మల్ డెలివరీలో ఉండే నొప్పి తట్టుకోవడం కంటే డబ్బులు ఖర్చు పెట్టడమే మంచిది అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. నార్మల్ డెలివరీ లో కూడా నొప్పిని తగ్గించే ఇంజెక్షన్స్ ఉన్నాయి.. ఇస్తారు. అయినా కూడా సిజేరియన్‌కే చాలా మంది ఓటు వేస్తారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. నార్మల్ డెలివరీ టైమ్‌కి తెలిసిన డాక్టర్ అందుబాటులో లేకపోతే, పరిచయం లేని కొత్త డాక్టర్‌తో నార్మల్ డెలివరీకి సిద్ధపడటం కన్నా పరిచయం ఉన్న పాత డాక్టర్ తో సిజెరియన్ చేయించుకోవడం ఉత్తమం అన్న భావన. రెండోది జాతకాల మీద నమ్మకం.

​సిజేరియన్ ఎందుకు చేస్తారంటే..

samayam telugu

ఒక్కోసారి చాలా ఏళ్ళ తర్వాత గర్భం ధరించినా.. చాలా సార్లు అబార్షన్స్ అయినా, తల్లికి వయసు ఎక్కువగా ఉన్నా, ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ కారణంగా గర్భం ధరించినా నార్మల్ డెలివరీ అంతా సిద్ధపడరు. సహజ ప్రసవం ప్రమాదకరం కాకపోయినా, సిజేరియన్‌లోలా బిడ్డని పువ్వులా బయటికి తీయడమైతే జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లకి ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు అడగడంతో సిజేరియన్ చేయడానికి అంగీకరిస్తున్నారు. నార్మల్ డెలివరీలో బిడ్డ జననం ఎవరి చేతిలోనూ లేదు. అది సరైన టైం కాకపోతే బిడ్డ భవిష్యత్ బావుండదేమో అన్న భయం, బెంగ. అదే సిజేరియన్ డెలివరీ అయితే అనుకూలమైన సమయంలో డెలివరీ జరుగుతుంది. బిడ్డ జాతకం బావుంటుంది అనే భరోసా.

Also Read : నాన్ వెజ్ కొంటున్నారా.. ఇక్కడే తీసుకోండి..

రెండోసారి నార్మల్ డెలివరీ అవుతుందా..

samayam telugu

ఇది మంచిదా అంటే, నార్మల్ డెలివరీ కంటే మాత్రం మంచిది కాదు. స్త్రీల శరీరాలు సహజ ప్రసవానికి అనువుగానే ఉంటాయి. కానీ, నొప్పులు చాలా సేపు ఉండడం, నొప్పి భరించలేకపోవడం, లోపల శిశువు పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది…ఇవన్నీ కూడా సిజేరియన్ చేయడానికి కారణాలే. సిద్ధాంతపరంగా ఎన్ని సిజేరియన్లు అయినా చేయొచ్చు కానీ, వాస్తవానికి ఒక్కో సిజేరియన్‌కీ యుటరస్ బలహీనపడుతుంది. కుట్టు మానడానికి పట్టే సమయం పెరుగుతుంది. మొదటిసారి సిజేరియన్ అయి ఆ గాయం సరిగా మానకపోతే రెండవసారి నార్మల్ డెలివరీ టైమ్‌లో యుటెరస్ రప్చర్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి నార్మల్ డెలివరీ ట్రై చేయడానికి కూడా తొందరగా ఎవరూ సాహసించరు.

Also Read : శృంగారంలో మహిళలు మెచ్చే భంగిమలు, కోరికలు ఇవే!

​​డాక్టర్‌‌ని ఎవరినీ ఎంచుకోవాలంటే..

samayam telugu

సిజేరియన్ కూడా సర్జరీయే. మిగిలిన సర్జరీలలో ఉండే రిస్క్స్ అన్ని ఇందులో కూడా ఉంటాయి. అందుకని సిజేరియన్ ఎప్పుడూ ప్లాన్-బీ గానే ఉండాలి. ప్లాన్-ఏ నార్మల్ డెలివరీనే. బిడ్డని ఎలా కనాలి అన్నది పూర్తిగా తల్లి ఇష్టం. అందులో డాక్టర్ల కన్వీనియెన్స్‌కి చోటు లేదు. అందుకని మీ డాక్టర్ ని ఎంచుకునేటప్పుడు నార్మల్ డెలివరీ మీద నమ్మకముండి అవసరమైతే తప్ప సిజేరియన్ చేయని డాక్టర్ ని ఎంచుకోండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *