Charmy Retirement: Charmi Kaur: చార్మి అనూహ్య నిర్ణయం.. ఇక ‘పూరీ’తోనే ప్రయాణం, షాక్‌లో ఫ్యాన్స్ – actress charmy kaur announces retirement from acting


హీరోయిన్ చార్మి, దర్శకుడి పూరీ జగన్నాథ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి కరోనా కేసుల్ని మించి కథనాలు వస్తున్నా.. ఆ జంట ఎప్పుడూ జంటగానే సినిమాల పంట పండిస్తున్నారు. చార్మిని ‘జ్యోతిలక్ష్మి’తో ఏ రేంజ్‌లో చూపిద్దాం అనుకున్న పూరీ ప్లాన్ వర్కౌట్ కాలేకపోయినప్పుటికీ ఆ తరువాత నుండి ఈ ఇద్దరి మధ్య బంధం బాగా బలపడింది. పూరీకి సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతూ.. నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది చార్మి. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనక్ట్స్‌ బ్యానర్స్‌లో జోడీగా సినిమాలు తీస్తున్నారు పూరీ, చార్మిలు.

డేరింగ్ దర్శకుడుతో డాషింగ్ నిర్మాత డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నా.. ఈ ఇద్దరూ ఒకటిగా సినిమాలు మొదలుపెట్టాక.. మొదట్లో కాస్త కుదుపులు ఎదురైనా ‘ఇస్మార్ట్ శంకర్’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’తో పాటు పూరీ కొడుకు ‘రొమాంటిక్’ చిత్రానికి నిర్మాణ భాద్యతల్ని పూరీ దగ్గరే ఉండి చక్కబెడుతోంది చార్మి.

Read Also: శ్రీరెడ్డి మొదటి భర్త గుట్టు విప్పిన ఆమె తల్లి.. మెడలో తాళి యాక్టింగ్ కోసమే అయినా!!

ఈ తరుణంలో అనూహ్యం నిర్ణయం తీసుకుంది చార్మి. పద్దు ఆడపులి అంటూ ‘శ్రీఆంజనేయం’లో అందాలను దారబోసి హాట్ సుందరిగా మారింది. భారీ అందాలతో 2002-15 వరకూ గౌరి, మాస్, చక్రం, లక్ష్మి, స్టైల్, రాఖీ, కింగ్, రగడ, ఢమరుకం ఇలా 50పైగా చిత్రాల్లో నటించింది. ఇక 2015 తరువాత పూరీతో కలిసి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన చార్మి.. హీరోయిన్‌గా ప్రయత్నాలు ఆపేసింది. అంద చందాలు అన్నీ ఉన్నా వాటిని పూరీ కనెక్ట్స్ వరకూ పరిమితం చేసి నిర్మాత అవతారం ఎత్తింది. ఓన్లీ పూరీ జగన్నాథ్ సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా ఉంటూ.. జ్యోతిలక్ష్మి, రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, ఫైటర్ చిత్రాలకు పూరీతో కలిసి పనిచేస్తుంది.

అయితే హీరోయిన్‌గా తనలోని గ్లామర్‌ని పూరీ ఏదో రోజు మళ్లీ బయటకు తీయబోతున్నాడనే తరుణంలో ఇక నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది చార్మి. ఇక హీరోయిన్‌గా తెరపై కనిపించే ఉద్దేశమే లేదని.. నూటికి నూరు శాతం ఇక నటించని చెప్పారు చార్మి. తనకంటే అందమైన బాగా నటించే అమ్మాయిలు బోలెడు మంది వస్తున్నారు.. ఇంకా అక్కడే హీరోయిన్ ప్లేస్‌ని వేలాడుతూ ఉండటం కరెక్ట్ కాదు. నిజానికి జ్యోతిలక్ష్మి టైంలోనే నటిగా రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకున్నా… కాని పూరీ, నిర్మాత సీ కళ్యాణ్ వద్దన్నారు. ఇప్పుడు టైం వచ్చింది రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు చార్మి. మొత్తానికి చార్మి ఇక వెండితెరపై కనిపించదు. కాని నిర్మాతగా మాత్రం ‘పూరీ కనెక్స్ట్‌’లో సత్తా చూపిస్తానంటోంది చార్మి.

Read Also: చార్మి అనూహ్య నిర్ణయం.. ఇక ‘పూరీ’తోనే ప్రయాణం, షాక్‌లో ఫ్యాన్స్

samayam telugu

చార్మిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *