condom shortage : కండోమ్‌ల కొరత కలవరం.. లాక్‌డౌన్‌ వేళ విపరీత గిరాకీ, యూఎన్ సైతం ఆందోళన – un warns over condom shortage in the world as coronavirus forces to close factories


Samayam Telugu | Updated:

ప్రపంచంలో ఎంతో మంది పొట్టన పెట్టుకోవడంతో పాటు పలు రంగాలను సంక్షోభంలోకి నెడుతూ వస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చివరికి కండోమ్‌ల మార్కెట్‌నూ వదల్లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాటికి కొరత ఏర్పడుతోంది. కండోమ్‌ల తయారీలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలను మూసేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇలాంటి అగ్ర కంపెనీలు ప్రపంచంలో మలేసియా కేంద్రంగా పని చేస్తున్నాయి. ఓ కండోమ్‌ల తయారీ సంస్థ సీఈవో దీనిపై ఇలా విశ్లేషించారు. ‘‘ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారం. కండోమ్‌ల కొరత రాకుండా ఉండేందుకు మా పరిధిలో మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, మేం ఎంత చేసినా కండోమ్‌ల కొరత సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే దీన్ని చాలా మంది గర్భనిరోధక సాధనంగా వాడుతుంటారు కాబట్టి. కర్మాగారాల్లో వీటిని మేం ఉత్పత్తి చేసినా, వివిధ దేశాలకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు చేయడం కష్టమైన పని.’’ అని ప్రపంచంలోనే అతి పెద్ద కండోమ్ తయారీ సంస్థ కేరెక్స్‌కు సీఈవో అయిన గోహ్ మియా అన్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *