corona on currency notes: కరెన్సీ నోట్ల ద్వారా కరోనా? ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్! – can covid-19 spread through coins and bank notes? who tells


రోనా వైరస్.. తుమ్ము, దగ్గు, నోటి తుంపర్ల నుంచే కాదు. వ్యక్తిని తాకినా సరే వ్యాప్తి చెందుతుందనే సంగతి తెలిసిందే. అంతేగాక, కరోనా వ్యాధిగ్రస్తులు తాకిన వస్తువులను తాకినా సరే వైరస్ వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. అలాగే, శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. చేతులను కడగకుండా ముఖం గానీ, కళ్లు, నోటిని ముట్టుకోకూడదు.

ప్రతిరోజు కొన్ని వేల మంది చేతులు మారే కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా లేదా అనేది చాలామందిలో ఉన్న సందేహం. మార్కెట్‌లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా నోట్లను ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల ఇంకా నోట్లనే వాడుతున్నారు. చిరు వ్యాపారులు, కూరగాయల కొనుగోలు సమయంలో తప్పకుండా నోట్లు వాడాలి. దీంతో ప్రజల్లో నోట్ల వినియోగంపై భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కరెన్సీ నోట్లు, నాణేల ద్వారా కరోనా వ్యాపించదని స్పష్టం చేసింది. న్యూస్ పేపర్ల ద్వారా కూడా వైరస్ రాదని వెల్లడించింది. అయితే, ఇటీవల కొందరు కరెన్సీ నోట్లకు లాలాజలాన్ని అంటించి రోడ్లపై పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లతో జాగ్రత్తగా ఉండటం చాలామంచిది. ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా మనం కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తపడొచ్చు.

✺ కరెన్సీ నోట్లను ముట్టుకున్న చేతులతో ముఖం, కళ్లు, నోటిని ముట్టుకోకూడదు.
✺ నోట్లు తీసుకున్న తర్వాత చేతులను వెంటనే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.
✺ డెబిట్, క్రెడిట్ కార్డులను ముట్టుకున్న తర్వాత కూడా తప్పకుండా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.
✺ ఏటీఎం కేంద్రాల్లో చాలామంది డబ్బులు డ్రా చేస్తారు. కాబట్టి మీ టూత్ పిక్ తీసుకెళ్లండి.
✺ ఏటీఎంలోని బటన్స్‌ను టూత్ పిక్‌తో నొక్కండి. డబ్బులు డ్రా చేశాక ఆ టూత్‌పిక్ పాడేయండి.
✺ ఏటీఎంలో డోర్లు తెరిచి, మూసిన తర్వాత కూడా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.
✺ వీలైనంత వరకు డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలు చేయడమే ఉత్తమం.
✺ చెక్‌ బుక్‌లు తాకిన తర్వాత కూడా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి.
✺ నోట్లను తాకిన తర్వాత చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే వైరస్, బ్యాక్టీరియాలు చనిపోతాయి.
✺ అత్యవసరమైతే తప్పా బ్యాంకులకు వెళ్లొద్దు.
✺ బ్యాంకులకు ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులు వస్తుంటారు. దీని వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందవచ్చు.
✺ పేటీఎం, ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారానే నగదు ఇచ్చి పుచ్చుకోవడం మంచిది.

Also Read: కరోనా భయం.. డబ్బులను వేడిచేయబోతే బూడిద మిగిలింది! నోట్లతో వైరస్ వస్తుందా?

చైనాలో ఏం చేస్తున్నారంటే..:
చైనాలో కరోనా ప్రబలగానే.. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నగదు లావాదేవీలను నియంత్రించడానికి చర్యలు చేపట్టింది. నోట్ల చెలామణి వల్ల వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని భావించి కేవలం ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు చేయాలని ఆదేశించింది. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నోట్ల వినియోగం నిలిపేసి గిడ్డంగుల్లో భద్రపరిచింది. వాటి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదని నిర్ధారించిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. బ్యాంకుల్లో ఉన్న వాడేసిన నోట్లన్నింటినీ క్రిమి సంహారకాలతో శుభ్రం చేస్తోంది. అల్ట్రావయోలెట్ లైట్, అత్యధిక ఉష్ణోగ్రతల్లో బ్యాంక్ నోట్లను ఉంచి వైరస్‌ను చంపేస్తోంది. అనంతరం 14 రోజులపాటు ఆ నోట్లను సీల్ చేసింది. ఆర్థిక సమస్యలు ఉన్న ప్రాంతాలకు మాత్రమే నగదును సరఫరా చేస్తోంది. పాత నోట్ల చెలామణిని కూడా నిలపేసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *