coronavirus deaths in telangana : తెలంగాణలో రెండో కరోనా మరణం..! – 69 year old dies with coronavirus in hyderabad, second covid19 death in telangana


రోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో మరణం సంభవించింది. కరోనా బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇతడికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 70కి చేరుకున్నాయని.. వీరిలో 11 మంది పూర్తిగా కోలుకోగా, ఒకరికి మాత్రం పరిస్థితి కాస్త విషమంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ వృద్ధుడికి డయాబెటిస్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నాయని తెలిపారు. అతడి పరిస్థితి విషమించడంతో ఆదివారం (మార్చి 29) రాత్రి మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.


ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ముగిసిన కొద్ది గంటలకే కరోనాతో ఓ వ్యక్తి మరణించడం గమనార్హం. అయితే.. ఇండోనేషియా బృందంలోనూ 69 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.

Also Read:
రోడ్ల వెంట విషాద దృశ్యాలు.. కేసీఆర్ భరోసా, నడక ఆపిన వలస కార్మికులు





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *