coronavirus live updates: కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: మహమ్మారి ప్రభావం.. అమెరికాలో వీధినపడ్డ 2 కోట్ల మంది – coronavirus cases andhra and telangana across india state wise live updates in telugu


కరోనా వైరస్ ప్రజల ప్రాణాలపైనే కాదు, వారి జీవనోపాధిపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతోంది. మహమ్మారి వల్ల అమెరికాలో ఉద్యోగాలు పోయి వీధినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క ఏప్రిల్‌లోనే 2 కోట్ల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఫలితంగా మార్చిలో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో ఏకంగా 14.7 శాతానికి పెరిగింది. మరోవైపు, 50 లక్షల మంది ఉద్యోగుల పనిగంటలను ఆయా సంస్థలు గణనీయంగా తగ్గించేయడంతో అది వీరి ఆదాయంపై ప్రభావం చూపనుంది. అలాగే, దేశంలో నిరుద్యోగ భృతి కోసం 3.3 కోట్ల మంది ఎదురుచూస్తున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ట్రలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజునే 1,089 కొత్త కేసులు నమోదు కాగా ఇందులో 784 ముంబయిలో ఉన్నాయి. గత 24గంటల్లో మహారాష్ట్రలో 37 మంది బలయ్యారు. కరోనావైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న ముంబయిలో సైన్యాన్ని దింపుతారనే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. పోలీసులకు కొంత విశ్రాంతి ఇచ్చేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని ఇవ్వమని కోరతామని అన్నారు.

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘సముద్ర సేతు’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ మఘర్‌ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నారు. తొలివిడతగా గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తూ వెయ్యి మందిని దేశానికి తీసుకొచ్చినట్టు పేర్కొన్నాయి. శుక్రవారం సాయంత్రం వీరు భారత్‌కు చేరుకున్నారు.

కరోనాా వైరస్‌కు వ్యాక్సిన్, ఔషధం అభివృద్ధిపై కసరత్తు జరుగుతోందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి శానిటైజర్లు, ప్రత్యేక మాస్కులు, వ్యక్తిగత రక్షణ సాధనాలను తయారుచేయనున్నట్లు వెల్లడించారు. సొంత ఫార్ములాలతో గ్వాలియర్‌, ఢిల్లీలోని ల్యాబ్‌ల్లో శానిటైజర్లను ఉత్పత్తి చేస్తున్నామని, ఇప్పటికే 5 లక్షలకుపైగా బాటిల్స్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ‘డెవెన్‌’ పేరుతో తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను హైదరాబాద్ కేంద్రంలో రూపొందించినట్టు తెలిపారు.

ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ కూడా ఆరంభించాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ‘హ్యూమన్‌- మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌’ చికిత్సను అభివృద్ధిని వేగవంతం చేసింది. పూర్తి కథనం..
తెలంగాణలో కరోనా కేసులు కొత్తవి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు కూడా రోజూ పదుల సంఖ్యలో డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో, శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన ఓ మహిళ ప్రసవించింది. పూర్తి కథనం..

తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు బాగా తక్కువగా నిర్వహిస్తున్నారంటూ విశ్రాంత ఆచార్యుడు పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి గతంలో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యా్జ్యంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి కథనం..
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల రేటు పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1273 మంది కోలుకున్నారని తెలిపారు. పూర్తి కథనం..

ఆర్టీసీ బస్సు సర్వీసులు, రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది. పూర్తి కథనం.. విశాఖను కరోనా భయం వెంటాడుతోంది. కొద్దిరోజులు వైరస్ ప్రభావం అంతగా కనిపించకపోయిన మళ్లీ మూడు, నాలుగు రోజులుగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు మొత్తం 46 కేసులు నమోదయ్యాయి. వీరిలో 22మంది డిశ్చార్జ్ కాగా.. 24మంది చికిత్సపొందుతున్నారు. పూర్తి కథనం..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *