coronavirus vaccine: క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభించిన మరో వ్యాక్సిన్.. కొత్త విధానంలో టీకా అభివృద్ధి – us biotechnology company novavax begins vaccine trial on humans in australia


కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచంలో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్‌లు ప్రయోగ దశను దాటి.. క్లినికల్ ట్రయల్స్‌కు చేరాయి. ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగం కీలక దశకు చేరుకోగా.. తాజాగా ఆస్ట్రేలియాలోనూ టీకా ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రేలియాలో పరీక్షిస్తున్నట్లు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ నోవావ్యాక్స్‌ ప్రకటించింది. ఈ ఏడాది చివర్లోగా ప్రయోగాలను పూర్తిచేసి, వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 అనే ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను తొలి దశలో భాగంగా 131 మందిపై ప్రయోగించనున్నట్టు నోవావ్యాక్స్‌ పరిశోధన విభాగం అధిపతి గ్రెగోరి గ్లెన్‌ తెలిపారు. మంగళవారం ఆరుగురిపై ప్రయోగించామని, ఈ వ్యాక్సిన్‌ సురక్షితమేనా, సమర్థంగా పనిచేస్తోందా? అన్నది పరిశీలించనున్నామని ఆయన వివరించారు. కోవిడ్‌-19 నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్‌లు ప్రయోగాల దశలో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా చైనా, అమెరికా, ఐరోపాలోనే రూపొందుతున్నాయి. అయితే ఇందులో ఎన్ని సక్సెస్ అవుతాయానేది ఆసక్తికరంగా మారింది.

ఈ టీకాలు చాలా వరకూ విభిన్న పరిజ్ఞానాలతో సిద్ధమవుతున్నాయి. టీకా అభివృద్ధికి సమాంతరంగా వాటి డోసులనూ నోవావ్యాక్స్‌ రూపొందిస్తోందని గ్లెన్‌ చెప్పారు. తక్కువ డోసుల్లో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు జంతువులపై జరిగిన ప్రయోగాల్లో తేలిందన్నారు. ఈ ఏడాది చివరినాటికి 10 కోట్ల డోసులను, వచ్చే ఏడాది 150 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను నార్వేకు చెందిన సంస్థతో కలిసి రూపొందిస్తున్నామని, మొత్తం 388 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌లో నిర్వహించే తొలి దశ ప్రయోగ ఫలితాలు జులైలో వెల్లడవుతాయని నోవావెక్స్ పేర్కొంది. రెండో దశలో వివిధ దేశాల్లో చాలా మందిపై ప్రయోగిస్తామని తెలిపారు. ‘పురోగతిలో ఉన్న చాలా ప్రయోగాత్మక వ్యాక్సిన్లు కరోనావైరస్ ఉపరితలం చుట్టు ఉండే ‘స్పైక్’ ప్రోటీన్‌ను గుర్తించడానికి రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంటాయి.. వైరస్‌కు గురైనట్లయితే శరీరానికి ప్రతిస్పందించేలా చేస్తుంది. కొంతమంది ఆ ప్రోటీన్ కోసం కేవలం జన్యు సంకేతాన్ని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేస్తారు. మరికొందరు ప్రోటీన్ ఉత్పత్తి చేసే సమాచారాన్ని అందజేయడానికి హానిచేయని వైరస్‌ను ఉపయోగిస్తారు.

ఇంకా కొన్ని ప్రయోగాలు పాత పద్దతులను అవలంభిస్తున్నాయి. చనిపోయిన మొత్తం వైరస్‌తో వ్యాక్సిన్ తయారు చేస్తారు. అయితే, నోవావాక్స్ మాత్రం వీటికి భిన్నంగా కొత్త విధానాన్ని అవలంభిస్తోంది.. దీనిని రీకాంబినెంట్ టీకా అంటారు. హాని కలిగించని కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌ల తయారీకి ప్రయోగశాలలో జన్యు ఇంజనీరింగ్‌ను ఉపయోగించాం.. శాస్త్రవేత్తలు ప్రోటీన్‌ను వెలికితీసి శుద్ధి చేసి, వైరస్-పరిమాణ నానోపార్టికల్స్‌లో ప్యాక్ చేశారు’ అని తెలిపారు. తామె టీకా తయారుచేసే విధానంలో ఎప్పుడూ వైరస్‌ను ముట్టుకోమని నోవావాక్స్ గత నెలలో అసోసియేటెడ్ ప్రెస్‌కి వెల్లడించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *