coronavirus wuhan lab : వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ సృష్టి.. నోబెల్ శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు – coronavirus man-made in wuhan virology lab: french nobel laureate


ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రాణాంతక కోవిడ్-19 వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే జన్యుపరంగా సృష్టించినట్టు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తాజాగా, కరోనా వైరస్ గురించి నోబెల్ బహుమతి విజేత చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందని కాదని.. మానవ తయారీ అని ఫ్రాన్స్ వైరాలజిస్ట్, వైద్యంలో నోబెల్ అవార్డు గ్రహీత ల్యూక్ మోంటాగ్నియర్ అన్నారు. చైనా ప్రయోగశాలలో ఎయిడ్స్‌కు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా కరోనా వైరస్‌ను సృష్టించారని ఓ ఫ్రెంచ్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎయిడ్స్ వైరస్‌‌పై పరిశోధనలకుగానూ 2008లో మరో ఇద్దరితో కలిసి మోంటాగ్నియర్ నోబెల్‌ను అందుకున్నారు.


Read Also:
దేశంలోని 30 శాతం కేసులకు తబ్లీగ్‌తో లింక్.. తెలంగాలో 79 %, ఏపీలో 61 శాతం

కరోనా వైరస్‌కు 2000వ దశకం నుంచి ప్రత్యేకత కలిగిన వుహాన్ నేషనల్ బయో సేఫ్టీ లాబొరేటరీలో ప్రమాదం జరిగిన తర్వాత ఇది బయటకు వచ్చిందని మోంటాగ్నియర్ ఆరోపించారు. వుహాన్‌ నగరంలోని వైరాలజీ ల్యాబ్‌ నుంచి వైరస్ లీకయ్యిందని భావిస్తున్న అమెరికా దానిపై దృష్టి సారించిన సమయంలో నోబెల్ విజేత ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ల్యాబ్‌ నుంచి వైరస్‌ ఎలా బయటకు వచ్చింది? అసలు ఇందులో నిజమెంత? అన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు అగ్రరాజ్య నిఘా వ్యవస్థలు పూర్తిస్థాయిలో అత్యంత నిశితంగా అధ్యయనం చేస్తుంది.

Read Also: కేసీఆర్ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌ సడలింపుపై నిర్ణయం


అయితే, వివాదాలతోనే మోంటాగ్నియర్ ఎప్పుడూ వార్తల్లోనే నిలవడం గమనార్హం. మోంటాగ్నియర్ చేసిన పరిశోధనలు వివాదాస్పదమయ్యాయి. ‘డీఎన్ఏ (DNA టెలిపోర్టేషన్) ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు.. ఎయిడ్స్, పార్కిన్సన్ వ్యాధి నివారణలో బొప్పాయి ప్రయోజనాలు’ అనే పరిశోధనపై విమర్శలు వెల్లువెత్తాయి. మోంటాగ్నియర్ చేసిన ఆరోపణలపై ఆ దేశానికి చెందిన మరో శాస్త్రవేత్త తీవ్రంగా ఖండించారు. కనీసం ఇంగితజ్ఞానం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ప్రకృతిలో తాము కనుగొన్న వైరస్ కుటుంబంలోని చిన్న అంశాలని పారిస్‌లోని పాస్టర్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజిస్ట్ ఈటెన్నే సిమోన్ లోరియరే మండిపడ్డారు.

Read Also: సూర్యాపేట కరోనా కేసుల మిస్టరీ వీడిందిలా.. ఒక్క మహిళతో!


కోవిడ్ -19 జన్యుపరంగా ఉద్భవించిందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా జరుగుతోంది. అయితే, కరోనావైరస్ వుహాన్ ప్రయోగశాలలో ఉద్భవించిందనే ఆరోపణలను చైనా ఖండించింది. ప్రయోగశాల నుంచి వైరస్ ప్రారంభమైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని, దీనికి శాస్త్రీయ ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్, ఇతర వైద్య నిపుణులు వెల్లడించినట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *