dharmapuri arvind on kcr: అదంతా గొర్రెల మంద, కేసీఆర్ కరోనా సాయం సున్నా.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు – nizamabad mp dharmapuri arvind makes sensational comments on cm kcr


నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తనదైన శైలిలో మండిపడ్డారు. తెలంగాణలో గడిచిన ఆరేళ్లలో కుటుంబ పాలన తప్ప ఏమీ జరగలేదని విమర్శలు చేశారు. ఇటీవల సీ ఓటర్ సంస్థ విడుదల చేసిన దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నాలుగో స్థానంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రిని కూడా అభినందించారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం 16వ స్థానంలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏకపక్ష నిర్ణయాలతో సీఎం ముందుకు పోతున్నారనేందుకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు.

అంతేకాక, కేసీఆర్ మంత్రివర్గాన్ని కూడా ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. కేబినెట్‌ను గొర్రెల మందలో పోల్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ ఆ విషయాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. ఈ ఆరేళ్లలో ఇప్పటి వరకూ కేవలం 30 వేల లోపే ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. గతేడాది ఘోరంగా 42 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.

కరోనా సమయంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన సాయం సున్నా అని అర్వింద్ స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్రం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్ కింద ఇచ్చిన రూ.599 కోట్లను పూర్తిగా కరోనా సమయంలో ఇచ్చే రూ.1,500 సాయానికి మళ్లించారని చెప్పారు. కొవిడ్ ఆస్పత్రుల కోసం కేంద్రం మొదటి విడతలో ఇచ్చిన రూ.252 కోట్లు, రెండో విడతలో ఇచ్చిన రూ.200 కోట్లను కూడా రూ.1,500 సాయానికే మళ్లించారని వివరించారు. మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.12 కిలోల బియ్యం కేంద్రమే ఇచ్చిందని, ఇది తామే ఇచ్చినట్లు కేసీఆర్ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

Must Read: హైదరాబాద్‌‌లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు! ఎప్పటినుంచంటే..Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *