diet for work from home: వర్క్ ఫ్రమ్‌ హోమ్‌లో వీటిని తింటే మీకు అలసటే ఉండదు.. – tips for handle stress from working at home know here


ఈ ప్యాండెమిక్ వల్ల ఎంతోమంది ఇళ్లకే పరిమితమైపోయారు. ఇంట్లోంచి ఆఫీస్ వర్క్స్ అలాగే ఇంట్లోంచి ఆన్లైన్ క్లాసెస్ తో బిజీబిజీగా మారిపోయారు. కాబట్టి లాక్ డౌన్ బ్లూస్ కలగడం సహజం. భవిష్యత్తు గురించి భరోసా లేనప్పుడు ఇటువంటి నెగటివ్ ఫీలింగ్స్ కలగడం నార్మలే అంటున్నారు నిపుణులు. లాక్ డౌన్ వలన రెగ్యులర్ రొటీన్ లో మేజర్ ఛేంజెస్ వచ్చాయి. ఆఫీస్ కెళ్ళేవాళ్ళు, అలాగే స్కూల్స్ కు, కాలేజెస్ కు వెళ్ళేవాళ్ళు ఇళ్లకే పరిమితమైపోయారు. కాబట్టి, మానసికంగా స్ట్రెస్ కు గురవుతూ ఉండటం సహజం. కొలీగ్స్‌తో ఇంటరాక్షన్ లేదు. అలాగే, క్లాస్ మేట్స్ తో బాతాఖానీ లేదు. కాబట్టి, చాలామంది మానసికంగా ఎంతో డల్ అయ్యారు. మీరు కూడా ఇంటికే పరిమితమవడం వల్ల ఇలానే ఫీల్ అవుతున్నారా? అయితే, మీరు. మీ డైట్ లో కొన్ని హెల్తీ ఛేంజెస్‌తో మీ మూడ్ బూస్ట్‌ అవుతుంది. ప్రయత్నించి చూడండి.

Also Read : ఈ ఎక్సర్‌సైజెస్ చేస్తే నడుము చుట్టూ ఉన్న కొవ్వు కచ్చితంగా తగ్గుతుంది..

మీరు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డల్ అయితే, మిమ్మల్ని మీరు నార్మల్ గా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టయితే డైట్ లో హెల్తీ ఛేంజెస్ చేసుకోవడం వల్ల ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. హెల్తీ గట్ అనేది హ్యాపీ గట్. ఇది అనేక రకాల స్ట్రెస్, యాంగ్జైటీలను తొలగిస్తుంది. మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. సరైన ఆహారం బ్రెయిన్ పై పాజిటివ్ ఇంపాక్ట్ ను కలిగిస్తుంది. అలాగే బాలన్స్డ్ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా మెంటల్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కొన్ని ప్రత్యేక కెమికల్స్, విటమిన్స్ అలాగే మినరల్స్ మన బయోకెమిస్ట్రీపై ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తాయి. దాంతో, మన మూడ్ వెంటనే బూస్టవుతుంది అంటున్నారు నిపుణులు. అటువంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం:

1. డార్క్ చాకొలేట్:

డార్క్ చాకొలేట్ లో 70 శాతం కోకో ఉంటుంది. ఇది మంచి మూడ్ బూస్టర్. ఇది హెల్తీ డైట్ బ్రాకెట్ లోకి పెర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. శరీరంలోని ఎండార్ఫిన్స్ ను ఇది బూస్ట్ చేస్తుంది. కాబట్టి, ఎటువంటి ఎమోషనల్ అలాగే మెంటల్ స్ట్రెస్ నైనా సులభంగా తట్టుకోగలం.

iStock-474469148

2. ఒమేగా 3:

చేపలు, నట్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నేచురల్‌గా లభిస్తాయి. ఇవి శరీరంలోని సెల్ తయారీలో ముఖ్యమైన రోల్ పోషిస్తాయి. అలాగే, స్కిన్‌తో పాటు హెయిర్ హెల్త్ కు కూడా ఇవి ముఖ్యమే. ఇవి హ్యాపీనెస్ అనే ఫీలింగ్ ను కలిగిస్తాయి. ఒకవేళ వీటిని సహజంగా డైట్‌లోకి యాడ్ చేయడం కష్టమైతే ఇవి సప్లిమెంట్స్ రూపంలో కూడా దొరుకుతాయి. వాటిని వైద్యుల సలహా తీసుకుని వాడొచ్చు.

3. విటమిన్ డి ఫుడ్స్:

పుట్టగొడుగులు, పౌల్ట్రీ అలాగే పాలు వంటి వాటిలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ డి‌ని సూర్యరశ్మి నుంచి కూడా మనం పొందవచ్చు. ఇది నిజానికి గొప్ప నేచురల్ సోర్స్. ఇది బ్రెయిన్ లోని సెరోటోనిన్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో, డిప్రెషన్ అలాగే యాంగ్జైటీ తగ్గిపోతాయి.

Also Read : మత్తు మందు తర్వాత బిడ్డకి పాలివ్వొచ్చా..

4. ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, విటమిన్ సి, బీ6 పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఎసెన్షియల్ మైక్రో న్యుట్రియెంట్స్. బ్రెయిన్ యాక్టివిటీస్ ను రెగ్యులేట్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.

video-calling-indian-woman-picture-id1166129200

5. ప్రోబయోటిక్స్:

ఫెర్మెంటెడ్ ఫుడ్స్ గట్ లోని మంచి బాక్టీరియాను మెయింటెయిన్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి. మన ఇంటస్టైన్ లో జీవించే మంచి బాక్టీరియాను ప్రోబయోటిక్స్ అంటాం. ఇవి డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేస్తాయి. గట్ ను క్లీన్ చేస్తాయి. హెల్తీ గట్ బ్రెయిన్ ను ప్రశాంతపరుస్తుంది. సాంత్వన పరుస్తుంది.

6. అరటిపండ్లు:

ఇవి మీ మూడ్ ను మెరుగుపరుస్తాయి. వీటిలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ అలాగే డొపామైన్ వంటి ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ను తయారుచేస్తుంది. ఒక పెద్ద సైజు అరటిపండులో 16 గ్రాముల షుగర్ అలాగే 3.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ తో కలిసిన షుగర్ బ్లడ్ స్ట్రీమ్ లోకి మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్ గా ఉంటాయి. మూడ్ కంట్రోల్ లో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే చిరాకుతో పాటు మూడ్ స్వింగ్స్ ఇబ్బంది పెడతాయి.

Also Read : ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గాలంటే ఈ ఫేస్ మాస్క్ వేయాల్సిందే..

7. ఓట్స్:

ఓట్స్ కూడా మీ మూడ్ ను బూస్ట్ చేసే ఫుడ్స్ జాబితాలో చోటుచేసుకుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఒక కప్పుడు ఓట్స్ లో దాదాపు 8 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. బ్రేక్ఫాస్ట్ లో ఫైబర్ ను 1.5 నుంచి 6 గ్రాముల వరకు తీసుకున్నవారిలో మూడ్ అలాగే ఎనర్జీ బెటర్ గా ఉన్నట్టు స్టడీస్ తెలుపుతున్నాయి. ఓట్స్ లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువే. ఒక రా కప్ ఓట్స్ నుంచి రోజువారీ ఐరన్ కంటెంట్ అవసరంలో దాదాపు 19 శాతం లభిస్తుంది. ఐరన్ తగినంత లభించకపోతే విపరీతమైన అలసట, చిరాకు అలాగే మూడ్ డిజార్డర్స్ వేధిస్తాయి.

గత కొద్ది నెలలుగా లైఫ్ చాలా మారిపోయింది. ఈ ప్యాండెమిక్ వల్ల ఎంతోమంది ఇళ్లకే పరిమితమైపోయారు. ఇంట్లోంచి ఆఫీస్ వర్క్స్ అలాగే ఇంట్లోంచి ఆన్లైన్ క్లాసెస్ తో బిజీబిజీగా మారిపోయారు. కాబట్టి లాక్ డౌన్ ఇబ్బందిగా అనిపించడం సహజం. భవిష్యత్ గురించి భరోసా లేనప్పుడు ఇటువంటి నెగటివ్ ఫీలింగ్స్ కలగడం నార్మలే అంటున్నారు నిపుణులు. అయితే, దీనికి ఒక పరిష్కారం ఉంది. మెంటల్ హెల్త్ అలాగే ఫిజికల్ హెల్త్ అనేవి ఒకదానికొకటి లింకై ఉంటాయి. ఒకదానిపై ఫోకస్ పెడితే మరొకటి కూడా ఆటొమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన ఫీలింగ్స్ ను బయటకు వ్యక్తపరచడం ముఖ్యం. ముఖ్యంగా ప్రతిఒక్కరూ కరెంట్ సిట్యుయేషన్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు.

మీరు డల్ గా ఉన్నప్పుడు, కేలరీ రిచ్ ఫుడ్స్ అలాగే ఐస్ క్రీమ్ లేదా కుకీస్ వంటి హై షుగర్ ఫుడ్స్ తినాలన్న కోరిక కలుగుతుంది. వీటివలన మీకు తాత్కాలికంగా హ్యాపీనెస్ కలుగుతుంది. కాబట్టి, వీటిని ఎప్పుడుపడితే అప్పుడు తింటే మూడ్ బూస్టవుతుందని వీటికి అడిక్ట్ అయిపోవడం మంచిది కాదు. లాంగ్ రన్ లో ఇవి మీకు ఆరోగ్యకరం కావు. వీటివల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే రిస్క్ ఉంది. కాబట్టి, మీరు మీ మూడ్ ను బూస్ట్ చేసుకోవాలంటే హెల్తీ ఫుడ్స్ ను డైట్ లో భాగం చేసుకోవాలి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *