Donald Trump: వైద్యులు, నర్సుల మరణాలు అందంగా ఉన్నాయి: ట్రంప్ – donald trump controversy comments on doctors and nurses death in us


రచూ నోరు జారుతూ వివాదాల్లో చిక్కుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19తో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, నర్సులను ఉద్దేశించి ఈసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనాతో పోరాడుతూ వారు మరణిస్తున్న తీరు చూడటానికి చాలా అందంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్ల కొరత అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ గురువారం (మే 14) అలెన్‌టౌన్ పట్టణంలో మెడికల్ కిట్ల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారితో వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది పోరాడుతున్న తీరుపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ నోరు జారారు.

‘కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న వేళ మన హెల్త్ వారియర్స్ అద్భుతంగా పోరాడుతున్నారు. వాళ్లు హెల్త్ వారియర్స్ కాదా? కరోనా రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులలోకి వారు వెళ్తున్న తీరు, బాధితులకు చికిత్స అందిస్తున్న విధానం అద్భుతంగా ఉంది. ఒకవేళ వాళ్లు తమ విధులు వదిలేసి వెనక్కి వెళ్లిపోవాలనుకున్నా.. తలుపులు తెరిచే ఉంటున్నాయి, కానీ అలా చేయడం లేదు. యుద్ధంలో పోరాడుతూ బుల్లెట్లకు ఎదురేగి నేలకొరిగే సైనికుల్లా కొవిడ్-19 మీద జరుపుతున్న పోరాటంలో వైద్యులు, నర్సులు మరణిస్తున్నారు. ఇది చూడటానికి చాలా అద్భుతంగా, అందంగా ఉంది’ అని ట్రంప్ అన్నారు.

Must Read:1600 కి.మీ ప్రయాణించి కుప్పకూలి కూలీ మృతి.. టెస్టుల్లో షాక్!

నిజానికి ఆరోగ్య సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినా.. వారి మరణాలు అందంగా ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఆయణ్ని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘అంత అందంగా ఉంటే ఆయణ్నే చేయమనండి’ అని మండిపడుతున్నారు. ఎక్కడైనా మరణించడం అందంగా ఉంటుందా? అని నిలదీస్తున్నారు.

The moment this terrible virus reached our shores, each of you has worked relentlessly to get the vital supplies to our healthcare warriors.. And they are warriors aren’t they, when you see them going into those hospitals and they’re putting the stuff that you deliver, but they’re wrapping themselves, and the doors are opening, and they’re going through the doors, and they’re not even ready to go through those doors, they probably shouldn’t, but they can’t get there fast enough, and they’re running into death just like soldiers run into bullets in a true sense, I see that with the doctors and the nurses and so many of the people that go into those hospitals, it’s incredible to see, it’s a beautiful thing to see.

Donald Trump


ఆ ప్రశ్న చైనాను అడగాలి..!

ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో మీడియా ప్రతినిధులతో డొనాల్డ్ ట్రంప్ దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో కరోనా కేసులు అధిక మొత్తంలో ఎందుకు పెరుగుతున్నాయంటూ ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్నించగా.. ఆ ప్రశ్న చైనాను అడగాలంటూ ట్రంప్ బదులిచ్చారు. ‘మీడియా సమావేశానికి పిలిచి మీరు ప్రవర్తిస్తున్న తీరు సరికాదంటూ’ సదరు జర్నలిస్టు అసహనం వ్యక్తం చేయగా.. సమావేశం నుంచి ట్రంప్ అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా రోగులకు సేవలు అందిస్తూ పలువురు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది కూడా మరణిస్తున్నారు. వైద్య సిబ్బందికి అందించే వ్యక్తిగత రక్షణ తొడుగులు (పీపీఈ కిట్లు) సరిపోవడం లేదని, దీంతో వారు కూడా వైరస్ బారిన పడి మరణిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Also Read:ట్యాక్సీలకు రూ.10 వేల ఛార్జీ.. బాబోయ్ బాదుడు!Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *