Donald Trump Bunker: అట్టుడుకుతున్న అమెరికా.. రహస్య బంకర్‌లోకి ట్రంప్ – donald trump moves to underground bunker as protests and violence spillover


మెరికాలో జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. అధ్యక్ష భవనం ‘వైట్‌ హౌస్‌‌’కు నిరసన సెగలు తాకాయి. నిర్బంధాన్ని దాటుకొని వచ్చిన నిరసనకారులు అధ్యక్ష భవనం ముందు బీభత్సం సృష్టించారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా వైట్ హౌస్‌లోకి చొచ్చుకెళ్లారు. వైట్ హౌస్ తూర్పు ద్వారం వద్ద పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అధికారులు అండర్ గ్రౌండ్ బంకర్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ట్రంప్ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో కంజాస్ వెళ్లిపోయినట్లు సమాచారం.

వైట్ హౌస్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. ప్రపంచలోనే అత్యంత కట్టుదిట్టమైన అధ్యక్ష భవనంలోకి నిరసనకారులు చొచ్చుకురావడాన్ని భద్రతా అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సీఐఏ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. నిరసనకారుల ఆగ్రహావేశాలను ట్రంప్‌, ఆయన బృందం షాకింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది.

అమెరికాలోని 40కి పైగా ప్రధాన నగరాల్లో నిరసనజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కర్ఫ్యూ విధించినా లెక్కచేయకుండా నిరసనకారులు వేలాదిగా రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ బారికేడ్లను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టారు. పలు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పడంతో భాష్పవాయువు ప్రయోగించారు.

ఆదివారం (మే 31) రాత్రి శ్వేతసౌధం వద్ద హైడ్రామా నడిచింది. వెయ్యి మందికి పైగా ఆందోళనకారులు వైట్ హౌస్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. శ్వేతసౌధానికి ఉత్తర దిశగా ఉన్న లాఫాయెట్‌ పార్క్‌కు చేరుకొని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వైట్ హౌస్ పరిసరాల్లో ఉన్న అమెరికా జాతీయ జెండాను తీసి మంటల్లో వేశాడు. మరి కొంత మంది ఆందోళనకారులు అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విరిచి ఆ మంటల్లో వేశారు.

రహస్య బంకర్‌లోని అధ్యక్షుడు
వైట్ హౌస్ సమీపంలోని పార్క్‌ వద్ద నిరసనకారులు విధ్వంసం చేశారు. అక్కడ ఉన్న బాత్‌రూమ్‌లు, కొన్ని కార్యాలయాలకు నిప్పంటించారు. కొంత మంది వైట్‌ హౌస్‌పైకి రాళ్లు రువ్వారు. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో వైట్‌ హౌస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేయి దాటకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రహస్య బంకర్‌లోకి తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు ఆయణ్ని అక్కడే ఉంచినట్లు సమాచారం.

అధ్యక్షుడు బంకర్‌లోకి వెళ్లడం అమెరికా చరిత్రలో చాలా అరుదు. అత్యవసర సమయాలు, ఉగ్రదాడుల లాంటి పరిస్థితుల్లోనే ఈ బంకర్ ఉపయోగిస్తారు. ఏకంగా అధ్యక్షుడే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి రావడం, ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యక్ష భవనాన్ని వీడాల్సి వచ్చిందంటే అక్కడ నిరసనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఏం జరిగింది?
ఆఫ్రికన్‌ – అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఆయణ్ని అమానుషంగా కాల్చి చంపారనేది ప్రధాన ఆరోపణ. నిరసనలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులతోనూ పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల తీరుపై నిరసనకారులు మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభణతో కుదేలవుతున్న అమెరికాకు ఈ నిరసనలపర్వం కొత్త తలనొప్పిగా మారింది.

Also Read: 14 పంటలకు మద్దతు ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

samayam teluguSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *