egg bonda recipe: Siva Balaji: శివబాలాజీ ఎగ్ బోండా యమా టేస్టీ.. బట్ ఈ టిప్స్ పాటించలేదో గుడ్డు పగులుద్ది – bigg boss fame siva balaji egg bonda recipe


బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ వంట చేస్తే.. అదిరిపోయేలా ఉంటుందని ఆ సీజన్ కంటెస్టెంట్సే.. అప్పటి హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌ చెబితే వినడమే కానీ.. ఎప్పుడూ టేస్ట్ చెయ్యలేదా..? ‘చింత దేనికి దండుగ.. రెసిపీ చెబుతున్నాగా మెండుగా?’ అంటున్నారు శివబాలాజీ. అతడి భార్య మధుమితతో కలిసి.. ‘శివమధు కిచెన్’ అనే పేరుతో గత కొంత కాలంగా ఇద్దరూ సరికొత్త వంటకాలని పరిచయం చేస్తూ.. ఫాలోవర్స్ చేత వహ్వా అనిపించుకుంటున్నారు.

దాంతో శివమధు యూట్యూబ్ ఛానల్‌కి సబ్ స్కైబర్స్.. ఓ రేంజ్‌లో పెరుగుతున్నారు. అదే విషయాన్ని షేర్ చేసుకుంటూ.. ఈ సారి ఎగ్ బోండాతో సిద్ధమయ్యాడు శివబాలాజీ. అంతే కాదు కిచెన్‌లో ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలి వంటి కొన్ని జాగ్రత్తలు కూడా తెలుపుతూ.. ఓ షాకింగ్ వీడియో షేర్ చేసుకున్నారు శివ. ఎగ్ బోండా వేసుకునేప్పుడు ఎగ్‌ని కచ్చితంగా కట్ చెయ్యాలని, లేదంటే అది పేలుతుందని, పచ్చిమిర్చి లాంటివి కూడా చిన్నగా కట్ చేసిన తర్వాతే కాగిన నూనెలో వేసుకోవాలని చెబుతున్నారు.

ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు
గుడ్లు – 4(ఉడకబెట్టుకోవాలి), శనగపిండి – 2 కప్పులు, కారం – అర టీ స్పూన్, జీలకర్ర – కొద్దిగా, తెల్ల నువ్వులు – కొంచెం, జీలకర్ర పొడి – కొద్దిగా, గరం మసాలా – కొద్దిగా, బేకింగ్ సోడా – చిటికెడు, ఉప్పు – తగినంత, నీళ్లు – కొంచెం, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం శివబాలాజీ మాటల్లోనే వినేదాం.

samayam telugu



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *