eggshell health benefits: గుడ్డు పెంకులూ తినేయొచ్చు! ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! – eggshell powder is an effective calcium supplement


గుడ్డు ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్డో మీకు తెలిసిందే. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే.. వారికి తప్పకుండా గుడ్డును ఆహారంగా ఇవ్వాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను గుడ్డు శరీరానికి అందిస్తుంది. కొందరు గుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరిగిపోతుందని చెబుతుంటారు. కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదు. అది కేవలం అపోహ మాత్రమే. మీరు గుడ్డును పెంకు(Eggshell)తో సహా తినేసినా మంచిదే. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. గుడ్డును వేరుగా, గుడ్డు పెంకులను వేరేగా తీసుకుంటేనే మంచిది. అలా ఎందుకు చేయాలో తెలుసుకోవాలంటే.. కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్న ఈ ఆసక్తికర విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

గుడ్డును ఉడికించిన తర్వాత లేదా, అమ్లెట్ వేసుకున్న తర్వాత.. పెంకులను పక్కన పాడేస్తాం. వాటిని మనం వ్యర్థంగా భావిస్తాం. కానీ, అసలైన పోషకాలన్నీ ఆ గుడ్డులోనే ఉన్నాయటని పరిశోధకులు తెలుపుతున్నారు. గుడ్డు పెంకులను కూడా ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుందట. ఫలితంగా ఎముకలు, దంతాలు మరింత గట్టిపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఎలా తీసుకోవాలి?: గుడ్డు పెంకులను నేరుగా తినేయకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. గుడ్డు పెంకు మీద అనేక బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. కాబట్టి.. పెంకులను వేడి నీటిలో కనీసం 20 నుంచి 30 నిమిషాలు మరిగించి, పొడిగా చేసుకుని తీసుకోవాలి. పెంకులు పెంకులుగా తీసుకుంటే.. అంతర్గత అవయవాలకు హాని కలగవచ్చు. పొడి చేసిన గుడ్డు పెంకులను రోజుకు అర టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే చాలు. శరీరానికి కావల్సిన 90 శాతం కాల్షియం లభిస్తుంది.

గుడ్డు పెంకుల వల్ల ఎముకలు, దంతాలకు 1000 నుంచి 1500 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్-డి కూడా లభిస్తుంది. త్వరగా అలసిపోవడం, పనిలో చిరాకు, ఒత్తిడి లాంటి సమస్యలను కాల్షియం లేదా విటమిన్-డి లోపంగా భావించాలి. అలాంటివారు గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే తగిన కాల్షియం శరీరానికి లభిస్తుంది. అత్యధిక కాల్షియం పిల్లలు, వృద్ధులకే అవసరం అవుతుంది.

Read Also: ‘మా బంధువుల్లో ఓ అబ్బాయిని ప్రేమించా.. కానీ, అతడు నాకు అన్నయ్య…’

సబ్-సహారన్ ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇ-డెల్ఫీ జరిపిన (e-Delphi) సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అక్కడి పిల్లల్లో కాల్షియం పెరుగుదలకు గుడ్ల పెంకులను పొడి చేసి అందిస్తున్నారని తెలిసింది. అయితే, వారు ఉడికించి విధానంలోనే లోపాలు ఉన్నట్లు కనుగొన్నారు. అది మినహా.. కాల్షియం అందించడంలో గుడ్డు పెంకుకు మించినది మరేది లేదని తేల్చారు. గుండె పెంకులను సుమారు 30 నిమిషాల సేపు నీటిలో ఉడికించిన తర్వాతే వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ సర్వేకు హ్యూమన్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ (HREC) కూడా ఆమోదం తెలిపింది. ఈ సర్వే మాత్రమే కాకుండా.. 1998 నుంచి 2015 వరకు ఎనిమిది ఆర్టికల్స్ గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్ గురించి వివరించడం గమనార్హం.

ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి:

❂ గుడ్డు పెంకులను కేవలం బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే దానిపై ఉండే బ్యాక్టీరియా పోతుంది.
❂ మీకు ఎంత కాల్షియం అవసరమో.. అంతే తీసుకోండి. అవసరానికి మించిన కాల్షియం తీసుకుంటే.. హైపర్కాల్సెమియా, కిడ్నీ డ్యామేజ్, ❂ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
❂ గుడ్డు పెంకు పొడి వెనిగార్, నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్‌లో సులభంగా కరిగిపోతుంది.
❂ గుడ్డు పెంకు ఫౌడర్‌ను పిజ్జా, పాస్తా, మరేదైనా వంటకాల్లో వేసుకోవచ్చు. ఇది రుచిని ఏ మాత్రం మార్చదు.
❂ వృద్ధాప్యంలో వచ్చే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే కీళ్ల వ్యాధికి సైతం గుడ్డు పెంకు పొడిన ఔషదంగా వాడే విషయం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
❂ కాల్షియం సమస్యను ఎదుర్కొనే మహిళలు వైద్యుల సూచనతో గుడ్డు పెంకు పొడిని వాడొచ్చట.

Read Also: తొక్క తీయకుండా అల్లం వాడుతున్నారా? జాగ్రత్త!

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే ఈ కథనం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *