face mask for coronavirus : శ్వాసరూపంలో వ్యాపిస్తున్న కరోనాకి మాస్క్‌ ద్వారా చెక్ పెట్టొచ్చా – maskindia america told to people wear masks it will help to reduce virus fears


ప్రజలు బయటకి వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్స్ ధరించమని అమెరికా ప్రభుత్వం సలహా ఇస్తోంది. పరిశోధనల ప్రకారం, కరోనా వైరస్ శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతుందని చెబుతోంది..


అమెరికాలో రోజురోజుకి మృతుల సంఖ్య పెరగడంతో ఈ సలహా ఇస్తుంది.. అక్కడ రోజుకి దాదాపు 1,500 కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఈ వైరస్ వ్యాప్తికి మూలం అయిన చైనా, ఈ వ్యాధితో మరణించిన పౌరులకు జాతీయ సంతాప దినోత్సవాన్ని నిర్వహించింది.

గత ఏడాది చివర్లో కోవిడ్ -19 ఉద్భవించినప్పటి నుండి, సుమారు 1.1 మిలియన్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 60,000 మంది మరణించారు.

చనిపోయినవారిలో సింహభాగంగా ఐరోపా నిలిచింది, అందులో ప్రధానంగా ఇటలీ స్పెయిన్లలో తీవ్రత ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సాధారణ మాస్క్స్ లేదా స్కార్ఫ్ వినియోగం ఈ సంక్రమణ రేటును నివారించడంలో సహాయపడుతుందని సూచించారు.

కానీ, అదనంగా “ఇది మీ వ్యక్తిగత విషయం” అని, కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని, తనవరకు పాటించడం లేదని పేర్కొన్నారు. ” నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంటువ్యాధుల విభాగం అధిపతి ఆంథోనీ ఫౌసీ, ప్రకారం “ప్రజలు దగ్గు, తుమ్ములకు గురైనప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది” అని చెప్పారు.

కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొన్ని వైద్య చికిత్సల సమయంలో మాత్రమే గాలిద్వారా ముప్పు సంభవిస్తుందని తెలిసింది.

యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలలో ఇప్పటికే మాస్క్స్ కొరత మరింత తీవ్రంగా ఉంది. ఈ రెండూ చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

అమెరికాలో ఎక్కువగా వైరస్ ప్రభావితమైన న్యూయార్క్‌లోని అధికారులు కొన్ని రోజుల క్రితం ముసుగులు ధరించమని ప్రజలకు సలహా ఇవ్వడం ప్రారంభించారు, కానీ నగర వీధుల్లో ఈ సలహాలు పట్టించుకోనట్లు సంకేతాలు కనిపించాయి.

“నేను నన్ను మరియు నా కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకుంటే, మనకే కాదు సమాజానికి కూడా మంచిది” అని 58 ఏళ్ల హ్యాండిమాన్ ఎడ్డీ మర్రెరో, AFP కి చెప్పారు.

సుమారు 277,000 మంది అమెరికన్లు ఈ వ్యాధిపరంగా పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాకుండా ప్రతి పదిమంది పౌరులలో తొమ్మిది మంది లాక్డౌన్ కింద నిబంధనలను విధించుకుని నివసిస్తున్నారు.

వైరస్ వ్యాప్తి ఘోరంగా ఉన్న చైనా, వైరస్ కారణంగా చనిపోయినవారికి శనివారం జాతీయ సంతాప దినోత్సవం నిర్వహించింది – గత ఏడాది చివర్లో, వైరస్ మొదటిసారి వెలువడిన ఈ దేశంలో 3,000 మందికి పైగా మరణించారు.

ఈ సంతాప దినోత్సవం వైరస్ బారిన పడి చనిపోయిన “అమరవీరులను” స్మరించుకోవడానికి గల అవకాశంగా బీజింగ్ పేర్కొంది – ఈ వైరస్ వ్యాప్తి కారణంగా మరణించిన 14 మంది వైద్య కార్మికులకు ప్రభుత్వం గౌరవప్రదమైన బిరుదుని అందించింది. – వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరించి, అధికారులచే శిక్షించబడిన వ్యక్తితో సహా.

యూరప్ లో ఈ మరణాల సంఖ్య శుక్రవారం 40,000 కు చేరుకుంది, స్పెయిన్లో 24 గంటల్లోనే 900 మంది మరణించారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లతో సావాసం చేసిన తరువాత 29 ఏళ్ల అథ్లెటిక్, ధూమపానం చేయని యువకుడైన స్పానియార్డ్ జేవియర్ లారా బయటపడ్డాడు.

“నా కుమార్తె వ్యాధిబారిన పడుతుందని నేను భయపడుతున్నాను, నేను లక్షణాలను చూపించడం ప్రారంభించిన సమయంలో, నా బిడ్డను సైతం దూరంగా ఉంచాను” అని చెప్పాడు. ఈ ఎనిమిది వారాల సమయం, అతని జీవితంలోనే ఎన్నడూ లేనట్లుగా మరణంతో సమానంగా కనిపించినట్లుగా అభివర్ణించాడు.

సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ ప్రకారం, ఇటలీలో 766 కొత్త మరణాలు నమోదయ్యాయి, అయితే దాని ఇన్ఫెక్షన్లు కేవలం నాలుగు శాతం మాత్రమే పెరిగాయి.

“క్రొత్త గణాంకాల ప్రకారం కొత్త ఇన్ఫెక్షన్ల పెరుగుదల గతంకన్నా నెమ్మదిగా ఉంది” అని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. అంతేకాకుండా, ఇక్కడ కఠినమైన సామాజిక దూరం పాటించడం కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోగలిగాం అని చెప్పారు.

“కానీ స్పష్టమైన ఫలితాలు చూసేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. మనకు ఇచ్చిన కఠినమైన నియమాలను సడలించడం గురించి కూడా మరొకసారి ఆలోచించడం మంచిది” అని ఆమె తెలిపారు.

సిరియా, లిబియా, యెమెన్ వంటి దేశాలను ప్రస్తావిస్తూ “త్వరలో గడ్డుకాలం సమీపించనుంది” అని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వైరస్, మరియు సంబంధిత లాక్డౌన్ల కారణంగా దెబ్బతింది, US లో నిరుద్యోగులకు చెల్లింపుల కోసం మిలియన్ల మంది ప్రజలు సంతకం చేశారు కూడా.

యుఎస్, యూరోజోన్ ఆర్థిక వ్యవస్థలు ఈ త్రైమాసికంలో 30 శాతం వరకు తగ్గిపోతాయని ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. అంతేకాకుండా, ఈ పతనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరంగా 4.1 ట్రిలియన్ డాలర్లను తాకగలదని కూడా ఆసియా డెవెలప్మెంట్ బ్యాంక్ హెచ్చరించింది – ఇది ప్రపంచ ఉత్పత్తిలో ఐదు శాతానికి సమానం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *