నిర్మలమ్మ భారీ ఆర్థిక ప్యాకేజ్: టాప్-10 కీలక అంశాలివే!

మోదీ ఎట్టకేలకు కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిండానికి రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. నిర్మలా సీతారామన్ మీడియా కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు ఏంటివో చూద్దాం..


✺ ఉజ్వల స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచిత గ్యాస్ అందిస్తారు.

✺ పేద సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, వితంతువులకు నగదు బదిలీ ప్రయోజనాన్ని అందిస్తామని తెలిపారు. వీరికి రూ.1,000 అందజేస్తామని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల కాలంలో రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఈ డబ్బులు అందజేస్తామని తెలిపారు.

Also Read: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేకపోతున్నారా? ఈ 4 ఆప్షన్స్‌‌తో మీ సమస్య నుంచి గట్టెక్కండి!

✺ స్వయం సహాయక గ్రూప్స్‌కు రూ.20 లక్షల వరకు తనఖా లేని రుణాలు అందిస్తామని పేర్కొన్నారు.

✺ జన్ ధన అకౌంట్ కలిగి మహిళలకు నెలకు రూ.500 అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా మూడు నెలలపాటు డబ్బులు అందజేస్తామని పేర్కొంది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏకంగా 20 కోట్ల మంది అకౌంట్ దారులకు ప్రయోజనం కలుగనుంది.

✺ పీఎఫ్ రూల్స్ మారాయి. దీంతో పీఎఫ్ అకౌంట్ నుంచి ఇప్పుడు ఏకంగా 75 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే మూడు మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని అయినా వెనక్కి తీసుకోవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలోని అకౌంట్‌లో ఉన్న మొత్తంపై ఇది ఆధారపడి ఉంటుంది.

Also Read: SBI కస్టమర్లకు హెచ్చరిక: బ్యాంక్ టైమింగ్స్ మారాయి.. కొత్త పనివేళలు ఇవే!

✺ పీఎఫ్ ఖాతాకు ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని, కంపెనీ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని అంటే మొత్తంగా 24 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే మీ పీఎఫ్ అకౌంట్‌లో జమ చేయనుంది.

✺ నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బుల అంశం గురించి ప్రస్తావించారు. రైతులకు పీఎం కిసాన్ కింద రూ.2,000ను వచ్చే వారంలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో వచ్చే వారంలో అన్నదాతల అకౌంట్లకు రూ.2,000 జమ కానున్నాయి.

Also Read: బ్యాంక్ కస్టమర్లకు 2 అదిరిపోయే బెనిఫిట్స్.. కొత్త సర్వీసులు అందుబాటులోకి!

✺ కరోనా వైరస్ నేపథ్యంలో నర్సులు, పారామెడిక్స్, డాక్టర్ల కోసం ప్రత్యేకంగా రూ.50 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్‌ను ప్రకటించారు.

✺ ఎంఎన్ఆర్‌ఈజీఏ వర్కర్ల (కరువు పని) కూలీని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రూ.182 నుంచి రూ.202కు పెంచారు.

✺ రాష్ట్రాలు కోవిడ్ 19 మెడికల్ ఖర్చుల కోసం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ నిధులను ఉపయోగించుకోవచ్చని నిర్మలమ్మ రాష్ట్రాలకు అనుమతినిచ్చింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *