finger infection treatment: వేలి చివర్లు వాపుగా మారి నొప్పి పెడుతున్నాయా.. ఇలా చేయండి.. – finger infection swollen fingers symptoms and treatment details


శరీరం లోపలి అవయవాలూ, చర్మం, కండరాలూ – ఇవి కాస్తా పెద్దగా అయితే వాపు వస్తుంది. ఏ అవయవమైనా నీరు పడితే ఆ ప్రాంతం లో వాపు కనిపిస్తుంది. ఈ స్వెల్లింగ్ అనేది లోపల ఉండొచ్చు, చర్మంలా బయటికి కనిపించొచ్చు. ఏదో ఒక ప్రాంతంలోనే ఉండొచ్చు. శరీరమంతటా వ్యాపించొచ్చు. అలాగే వేలి చివర వాపు కూడా రావచ్చు. దానికి రకరకాల కారణాలు కూడా ఉండచ్చు. ఇంటి చిట్కాలతో ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి మెడికల్ హెల్ప్ అవసరం రావచ్చు.

1. ఇన్‌ఫెక్షన్

సాధారణంగా ఇన్ ఫెక్షన్ కారణంగా ఇలా చేతి వేళ్లు వాస్తుంటాయి. వేలి చివర వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని ఫెలన్ అంటారు. దీని కారణంగా వేలి చివర మెత్తగా ఉండే చర్మంపై ఎఫెక్ట్ పడుతుంది. ఆ ప్రదేశంలో చీము ఏర్పడుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే వాపు చాలా నొప్పి గా ఉంటుంది. ఇది ఎక్కువగా చూపుడు వేలు, బొటన వేలుకి వస్తుంటుంది. ఇది మామూలుగా ఏదైనా దెబ్బ తగిలన తర్వాత వస్తుంటుంది..

Also Read : ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఇలా చేయండి..

2. కండరాల వాపు..

కాలి వేళ్ళూ, చేతి వేళ్ళ జాయింట్స్ వాపుగా ఉన్నా, మండినట్లుగా ఉన్నా దానిని డాక్టిలైటిస్ అంటారు. దీని వల్ల వాపూ, నొప్పిగా ఉంటుంది. ఇది చేతి వేళ్లపై పడుతుంది. అప్పుడు నొప్పి, వాపులు ఉంటాయి. సొరియాటిక్ ఆర్థ్రైటిస్ ఉన్న వారికి డాక్టిలైటిస్ వాచ్చే అవకాశం ఎక్కువ. ఇది రావడానికి మిగిలిన కారణాలు
– ఇతర రకాల ఆర్థ్ర‌రైటీస్
– గౌట్
– టీబీ
– సికిల్ సెల్ ఎనీమియా
– సార్కోయిడాసిస్

3. గాయాలు
వేలికి ఏమైనా దెబ్బ తగిలితే వేలి చివర వాపు వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది వేళ్ళే. గోరు కింద దెబ్బ తగలొచ్చు, గోరు ఊడి వచ్చేయచ్చు. ఇలాంటివి ఏం జరిగినా వాపు వస్తుంది.

Also Read : దిండు పెట్టుకుని పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..

4. ప్రెగ్నెన్సీ

ప్రెగ్నెన్సీ టైమ్‌లో శరీరమంతా ఎంతో కొంత వాస్తుంది. దీన్నే మన వాళ్ళు నీరు పట్టడమంటారు. దీని వల్ల బాడీ బేబీ పెరుగుదలకి అనుకూలంగా మారుతుంది. జాయింట్స్ ని డెలివరీ కి ప్రిపేర్ చేస్తుంది. అయితే హఠాత్తుగా వేలి చివర వాపు వస్తే మాత్రం అది హై బీపీ వల్ల అని తెలుసుకుని వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి..

5. గౌట్

గౌట్ ఒక క్రానిక్ డిసీజ్. దీని వల్ల బాడీ లో యూరిక్ ఆసిడ్ చేరుకుంటుంది. ఈ యూరిక్ ఆసిడ్ వల్ల జాయింట్స్ లో క్రిస్టల్స్ ఏర్పడి నొప్పిని కలుగచేస్తాయి. ఇది సహజం గా కాలి బొటన వేలి వద్ద స్టార్ట్ అవుతుంది. మొదట్లో తక్కువగానే ఉన్నా, ట్రీట్ చెయ్యకపోతే ఎక్కువసార్లు, ఎక్కువసేపు ఉండడం మొదలౌతుంది.

6. కాన్సర్

ఎలాంటి కాన్సర్ అయినా బోన్ వరకూ పాకవచ్చు. అలాంటప్పుడు అది వేలి చివరి వాపుకు కారణం కావచ్చు. సుమారు 16 శాతం కాన్సర్లలో వేలి చివరి వాపే మొదటి లక్షణం గా కనపడుతుంది.

Also Read : లైంగిక కోరికలను ఆడవారు ఎలా కంట్రోల్ చేసుకుంటారంటే..

ట్రీట్మెంట్

వేలి చివరి వాపు వచ్చిన కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని సార్లు ఇంటి చిట్కాలు పని చెయొచ్చు. వీటిని వాడినా సమస్య తగ్గకపోతే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.

మెడికల్ ట్రీట్‌మెంట్

– గౌట్ వల్ల, ఆర్థరైటీస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్‌కి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు.
– యాంటి-ఇంఫ్లమేటరీ మెడిసిన్స్ కూడా వాడతారు.
– ఫెలన్స్ వల్ల వచ్చిన వాపుకి యాంటి-బయాటిక్స్ వాడతారు.
– గాయాల వల్ల వచ్చిన ప్రాబ్లం కి దానికి తగ్గట్లుగా ట్రీట్‌మెంట్ చేస్తారు.
– కాన్సర్ వల్ల వచ్చిన వాపు కాన్సర్ ట్రీట్‌మెంట్తో‌ తగ్గుతుంది.

హోం రెమెడీస్..

మెడికల్ అటెన్షన్ అక్కర్లేని చోట్ల కొన్ని హోం రెమెడీస్‌తో ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయొచ్చు. అలాగే, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన వాపు ఆటోమేటిగ్గా డెలివరీ తరువాత తగ్గిపోతుంది.

– ఎప్సం సాల్ట్ కలిపిన నీటిలో వేలు ఉంచడం వల్ల వాపు తగ్గుతుంది.
– ఫిష్, గ్రీన్ టీ, ఆకుకూరలూ, డార్క్ చాక్లేట్స్‌ని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య తగ్గేలా చేస్తుంది.
– టీ ట్రీ ఆయిల్‌ని కొబ్బరి నూనె లాంటి ఏదైనా ఆయిల్ తో కలిపి వాపు ఉన్న చోట అప్లై చేయొచ్చు.

ఎప్పుడు డాక్టర్ ని కలవాలి?

1. మూడు రోజుల కంటే ఎక్కువగా వాపు ఉంటే
2. విరిగిందేమో అని అనుమానముంటే
3. వాపు, నొప్పి భరించలేనంతగా ఉంటే
4. హోం రెమెడీస్ పని చేయకపోతే
5. ప్రెగ్నెన్సీ లో సడన్ గా వేలి చివర వాపు కనిపిస్తే
6. వాపు తో పాటూ చీము ఉంటే
7. దెబ్బ తగిలిన తరవాత వాపు కనిపిస్తే

మీరు తప్పకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *