fizzy drinks effects: కూల్ డ్రింక్సే అతడి ఆహారం.. కుళ్లిన శరీరం – man’s arm almost fell off from diet almost entirely of fizzy drinks


కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండొచ్చు. కానీ, మరీ.. ఆహారం మానేసి వాటినే తాగేస్తూ బతికేసే అంత పిచ్చి ఉంటే మాత్రం పరిస్థితి చేయి దాటొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. లేదా ఈ వ్యక్తిలా శరీరంలోని ఏదైనా అవయవం కుళ్లిపోయి ఊడిపడిపోవచ్చు కూడా. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే, మీరు మలేషియాలోని ఓ వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవం గురించి తెలిస్తే.. కూల్ డ్రింక్స్ తాగడానికి కాదు.. తాకడానికి కూడా భయపడతారు.

కౌలలాంపూర్‌‌కు చెందిన మహ్మద్ రజీన్ అనే వ్యక్తి కూల్ డ్రింక్ కనపడితే చాలు పూనకం వచ్చినట్లు అయిపోయేవాడు. దాహం వేసినా, ఆకలి వేసిన అతడి కడుపులో కూల్ డ్రింక్ పడిపోవల్సిందే. అలా మొదలైన అలవాటు.. వ్యసనంగా మారిపోయింది. డ్రగ్స్‌కు అలవాటు పడినవాడిలా డ్రింకులను మాత్రమే తాగుతూ కూర్చునేవాడు. ఫలితంగా అతడి శరీరం డ్రింకులకే అలవాటైంది.

ఫలితంగా అతడి కుడి భుజం బాగా నొప్పి పెట్టడం ప్రారంభమైంది. దీంతో అతడు వైద్యులను సంప్రదించాడు. వైద్య పరీక్షల తర్వాత డాక్టర్లు అతడికి డయబెటీస్ (మధుమేహం) ఉన్నట్లు నిర్ధరించారు. తీపి పదార్థాలకు, పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, అప్పటికీ అతడు కూల్ డ్రింక్స్‌పై యుద్ధాన్ని ఆపలేదు. ఏదైతే అయ్యిందని ఆకలి తీర్చుకోడానికి డ్రింక్స్ తాగుతూనే ఉన్నాడు.

తీపి వల్ల అతడి శరీరంలో సుగర్ స్థాయిలు పెరిగిపోయాయి. చివరికి.. అతడి భుజం ఇన్ఫెక్షన్‌కు గురైంది. బాగా కుళ్లిపోయి పుండులా తయారైంది. కొద్ది రోజులు అలాగే వదిలేస్తే చేయి ఊడిపోయేంత దయనీయ స్థితికి చేరింది. దీంతో అతడి కుటుంబికులు రజీన్‌కు చివాట్లు పెట్టి హాస్పిటల్‌లో చేర్చారు. అతడి పరిస్థితి బాగోలేదంటూ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.

Read Also: కన్నె పిల్లలే టార్గెట్.. సెక్స్ చేసి హత్యలు, భార్య సాయంతో భర్త అరాచకాలు.. మిస్టరీ వీడిందిలా!

అతడిని పరీక్షించిన వైద్యులు.. రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. రజీన్ చర్మం, ఎముక కింది భాగం బాగా పాడైపోయిందని, కొద్ది రోజులు అలాగే వదిలేస్తే చేయి.. శరీరం నుంచి వేరయ్యేదని తెలిపారు. చెడిపోయిన చర్మాన్ని తొలగించి.. ఇన్ఫెక్షన్‌కు గురైన ప్రాంతంలోని చీమును తొలగించారు. ఇకపై కూల్ డ్రింక్స్ తాగొద్దని, బుద్ధిగా డైటీషియన్లు సూచించే ఆహారాన్ని మాత్రమే తినాలని వైద్యులు అతడికి సూచించారు.

Read Also: లిఫ్ట్ ఇస్తాడు, హత్యచేసి.. శవాలతో సంభోగం, తల్లినీ వదలని కామాంధుడు!

చూశారుగా.. కూల్ డ్రింక్సును అలవాటుగా మార్చుకుంటే ఎంత ప్రమాదమో. మీ తల్లిదండ్రులు లేదా వారి పూర్వికుల్లో ఎవరికైనా డయబెటిస్ ఉన్నట్లయితే.. మీరు కూడా కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. ఇక వేళ ఆ నేపథ్యంలో లేకపోయిన మధుమేహం దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *