FlexPay: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి- రూ.8,000 జీతంతో సులభంగా రుణం! – vivifi india finance now offers scan now and pay later option on upi


ప్రధానాంశాలు:

  • వివిఫై ఇండియా ఫైనాన్స్ కొత్త సర్వీసులు
  • ఫ్లెక్సీపే‌తో భాగస్వామ్యం
  • యూపీఐ యూజర్లకు ప్రయోజనం

ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి అనే సర్వీసులకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. బ్యాంకులు మాత్రమే కాకుండా ఫిన్‌టెక్ కంపెనీలు కూడా కస్టమర్లకు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ వివిఫై ఇండియా ఫైనాన్స్ కూడా ఇలాంటి సర్వీసులనే ప్రారంభించింది.

వివిఫై ఇండియా ఫైనాన్స్ తాజాగా ఫ్లెక్స్‌పే‌తో జత కట్టింది. కొత్త పేమెంట్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ‘స్కాన్ నౌ అండ్ పే లేటర్’ సదుపాయన్ని కస్టమర్లకు అందిస్తోంది. యూపీఐ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదా డిజిటల్ వాలెట్స్‌లో డబ్బులు లేకపోతే ఈ ఫీచర్ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు.

Also Read: SBI శుభవార్త.. కస్టమర్లకు పండుగ బొనాంజా.. బ్యాంక్ కీలక నిర్ణయం!

ఫ్లెక్స్‌పే‌తో యూపీఐ ద్వారా ఎప్పుడైనా ఎవరికైనా చెల్లించపు నిర్వహించొచ్చు. ఆన్‌లైన్‌లోనే లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎలాంటి తనఖా లేకుండానే రుణం పొందొచ్చు. వడ్డీ రేట్లు కూడా ఆమోదయోగ్యంగానే ఉంటాయి. ఒక్కసారి ఆమోదం లభిస్తే.. ఆ డబ్బులను ఎప్పుడైనా ఎన్ని రోజులైనా ఉపయోగించుకోవచ్చు.

భారతీయ పౌరులు అయ్యి ఉండాలి. అలాగే వేతనం వస్తుండాలి. 21 ఏళ్లకు పైన వయసు తప్పనిసరి. కనీసం రూ.8,000 జీతం వచ్చినా చాలు. తీసుకున్న రుణాన్ని 3 ఏళ్లలోపు తిరిగి చెల్లించొచ్చు. ప్లెక్స్‌పే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, అకౌంట్ క్రియేట్ చేసుకొని లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లోన్ అప్రూవల్ వచ్చిన వెంటనే డబ్బులను ఉపయోగించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *