free 4.0 education: పేద పిల్లలకు ఉచితంగా 4.0 విద్య: నెక్ట్స్‌వేవ్ సంకల్పం.. కోటి మందికి శిక్షణ, అర్హత, దరఖాస్తు వివరాలు – nextwave india 4.0: free education for one crore children from financially backward families


న్ని రకాల చీకట్లను తరిమికొట్టేది ‘విద్య’. కానీ, 70 వసంతాల స్వాతంత్య్ర భారతదేశంలో అందరికీ విద్య అందని ద్రాక్షే అవుతోంది. పేద కుటుంబాల పిల్లలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. బలపాలు పట్టాల్సిన లేలేత చేతులు పలుగు, పార పట్టి చెమటలు చిందించాల్సిన దుస్థితి ఉంది. పేదరికం ఎందరో చిన్నారులను విద్యకు దూరం చేస్తోంది. కరోనా సంక్షోభం మరింత మందిని పేదరికంలోకి నెట్టేసింది. అలాంటి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ‘నెక్ట్స్‌వేవ్’ సంస్థ కంకణం కట్టుకుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తోంది. అది కూడా చదువుతో పాటు పని నైపుణ్యాలను నేర్పించే 4.0 విద్య. కోటి మంది చిన్నారులకు ఉచితంగా విద్య అందించాలనే పవిత్ర ఆశయంతో ముందుకొచ్చింది.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరవచ్చు. Every Child Counts అనే నినాదంతో అక్టోబర్ 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులకు 21 సంవత్సరాలు వచ్చేంత వరకు నెక్ట్స్‌వేవ్ అండగా నిలుస్తుంది. అకడమిక్ అంశాలతో పాటు ఇండస్ట్రీ అవసరాలకు తయారయ్యేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. చిన్న వయసు నుంచే పిల్లలను ఈ దిశగా ప్రోత్సహిస్తారు.

విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహదపడాలనేది నెక్ట్స్‌వేవ్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో 4.5 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణలో 3 లక్షల మంది విద్యార్థులకు ఈ విధానంలో 4.0 విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరితో పాటు మహారాష్ట్రలో 9 లక్షలు, బిహార్‌లో 8.5 లక్షలు.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు చేయూత అందించనున్నారు. అక్టోబర్‌లో ఫేజ్ 1 మొదలైంది. దేశంలోని 650 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

ఏయే అంశాలు నేర్పిస్తారు?
పిల్లల్లో సృజనాత్మకత (Creativity) పెంచేవిధంగా తరగతులు ఉంటాయి. టెక్ 4.0, బిజినెస్ 4.0, ఎంట్రప్రెన్యూర్‌షిప్ 4.0 తదితర అత్యాధునిక అంశాల సమాహారంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. పిల్లలు ఎక్కడ నుంచైనా నేర్చుకునే విధంగా ఈ ట్రైనింగ్‌ను డిజైన్ చేశారు. తరగతులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. చిన్న వయసు నుంచే 4.0 నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల ఉద్యోగం సంపాదించడానికి, సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడానికి అపారమైన అవకాశాలు లభిస్తాయని నెక్ట్స్‌వేవ్ ప్రతినిధులు చెబుతున్నారు.

‘ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్’ అని ఐబీ హబ్స్ సీఈవో దొమ్మేటి కావ్య అన్నారు. ‘ఆవిష్కరణకు, సరికొత్త వస్తువులు తయారు చేయడానికి ప్రతి చిన్నారికీ సమానమైన అవకాశాలు ఉండాలని మేం భావిస్తున్నాం. లక్షలాది చిన్నారులను ప్రభావితం చేసి వారి కుటుంబాల్లో పురోగతి చూడాలని ఆసక్తిగా చూస్తున్నాం. ఈ కోటి మంది విద్యార్థులు సమాజంలో ఆదర్శంగా నిలుస్తూ, ఇంకెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. తద్వారా ఓ గొప్ప మార్పుకు బీజం వేసినవారు అవుతారు’ అని ఆమె పేర్కొన్నారు.

ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితం. పిల్లల తరఫున ఎవరైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు. ‘దీని గురించి అందరికీ తెలుపండి. దీని అవసరం ఉన్న పిల్లల వివరాలు మాకు అందించండి’ అని కావ్య తెలిపారు.

‘ఈ ప్రాజెక్టు ద్వారా మా కల నెరవేరనుంది’ అని మేక్ ది వరల్డ్ వండర్‌ఫుల్ ఫౌండర్ దబ్బర మేఘన వ్యాఖ్యానించారు. ‘మొదటి నుంచి ఎవ్రీ చైల్డ్ కౌంట్స్ నినాదాన్ని నమ్ముతూ పిల్లలకు అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఐబీ హబ్స్ , వారి అనుబంధ స్టార్టప్స్ మాకు సహకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆమె అన్నారు.

‘పనితో కూడిన జ్జానం ప్రతికూలతను కూడా సంపదగా మారుస్తుంది’. మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది. సాంకేతికతలో మేటిగా నిలిచేందుకు కోట్లాది మంది భారతీయులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పిల్లవాడు అబ్దుల్ కలాం అంత గొప్ప కలలు కంటూ సరికొత్త ఆవిష్కరణలను తయారు చేయాలనేది నెక్ట్స్‌వేవ్ కల. ఆ కలలో ఎవరైనా భాగస్వామ్యం కావొచ్చు!

ముఖ్యమైన అంశాలు:
అర్హత: 5వ తరగతి నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థుల తరఫున ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. కోర్సు పూర్తిగా ఉచితం.

తరగతుల నిర్వహణ: ఆన్‌లైన్ ద్వారా.

ఈ ప్రోగ్రాం గురించి పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://bit.ly/2Gx4BIW

Don’t Miss:లాక్‌డౌన్ కారణంగానే వానల బీభత్సం..!

Also Read:అంతరిక్షం నుంచి ఓటేసిన వ్యోమగామి.. ఎలాగంటే!

Must Read:బాలికతో రైలెక్కిన కిడ్నాపర్.. నాన్‌స్టాప్‌గా వెళ్లి పోలీసుల ముందు ఆపిన లోకో పైలట్Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *