Gabriella Demetriades: బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ‘ఊపిరి’ నటి సోదరుడి అరెస్ట్ – gabriella demetriades brother arrested in bollywood drugs case


బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రియా జైలు నుంచి బయటపడింది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మరో నటి సోదరుడిని అరెస్ట్ చేశారు.

Also Read: తండ్రీ కొడుకులుగా సూర్య.. వైరల్ అవుతున్న కొత్త గెటప్

నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి గాబ్రియెల్లా డెమెట్రైడీస్‌ సోదరుడు అగిసియాలోస్‌ని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లొనోవాలా రిసార్ట్స్‌లో ఉండగా అతడిని అరెస్ట్ చేసిన అధికారులు అల్పాజోలమ్ టాబ్లెట్లు, హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: ఆ రీమేక్‌కు నో చెప్పిన పవన్‌ కళ్యాణ్!

అగిసియాలోస్‌కి అనేక మంది డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు, గాబ్రియెల్లా పార్టనర్ అర్జున్ రాంపాల్ పేరు కూడా వినిపిస్తోంది. దర్యాప్తు ముందుకెళ్లేకొద్దీ మరెంత మంది పేర్లు బయటికి వస్తాయో చూడాలి మరి.

Also Read: మూడో భర్తను తన్ని తరిమేసిన ప్రముఖ నటి.. ముందే ఊహించానన్న నిర్మాత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *