gandhi principles covid 19: గాంధీ చెప్పిన ఈ ఐదు సూత్రాలతో కరోనా వైరస్‌ను తరిమికొడదాం! – fight against covid-19 with gandhi’s principles, dcp ramgopal nayak shares valuable tips


రోనా వైరస్ నేపథ్యంలో యావత్ ప్రపంచం విలవిల్లాడుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం వల్ల ఈ వైరస్‌ వ్యాప్తిని కొంతవరకు అడ్డుకోగలిగాం. భారతీయులు తలచుకుంటే.. తెల్లదొరలను తరిమినట్లే కరోనా వైరస్‌ను తరిమికొట్టచవచ్చు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన డీసీపీ (క్రైమ్) డాక్టర్ రాంగోపాల్ నాయక్ చెప్పిన ఈ గాంధీ సూత్రాలను పాటిస్తే తప్పకుండా అది సాధ్యమవుతుంది. తెలంగాణకు చెందిన రాంగోపాల్ నాయక్ గుంటూరులో వైద్య విద్యను పూర్తిచేశారు. కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు రేయింబవళ్లు శ్రమిస్తూ.. ప్రజల కోసం ఆయన కొన్ని విలువైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ ఐదు గాంధీ సూత్రాలతో కరోనాను తరిమి కొట్టండి:

samayam telugu

డీసీపీ (క్రైమ్) డాక్టర్ రాంగోపాల్ నాయక్


1. ఇంటి వద్దే సత్యాగ్రహం: కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు కరోనాకు మందు లేదు. కేవలం నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో గాంధీ సూత్రాలతో సమర్థవంతంగా కరోనాను తిప్పికొట్టవచ్చు. ఇంట్లోనే ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కృషిచేద్దాం. బయట గుంపులుగా తిరగకుండా.. శాంతియుత మార్గంలో వైరస్‌ను తరిమికొడదాం.

2. సహాయ నిరాకరణ:కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందనే సంగతి తెలిసిందే. భౌతిక దూరంగా పాటించకుండా ఇతరులకు సమీపంగా నిలుచోవడమంటే.. వైరస్‌కు సహకరించినట్లే లెక్క. అందుకే, మనం భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్‌కు సహాయ నిరాకరణ చేద్దాం. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, ముఖానికి మాస్క్ ధరించడం, కరచలనం చేయకుండా సంస్కరవంతంగా నమస్కారాలు చేస్తూ వైరస్‌కు వీడ్కోలు చెబుదాం.

3. అహింస, శాంతి మార్గంలో..: ప్రభుత్వం విధిస్తున్న లాక్‌డౌన్, నియమ నిబంధనలను వ్యతిరేకించకుండా తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ అహింస మార్గంలో శాంతియుతంగా వీటిని పాటించాలి. ఇతరులకు కూడా తెలియజెప్పాలి. ఎందుకంటే.. ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన ప్రాణాలను కాపాడేందుకే. కాబట్టి.. తప్పకుండా నిబంధనలను పాటించి సహకరించాలి.

Also Read: వేసవిలో ఎలాంటి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి? లోషన్స్ వాడకపోతే ఏమవుతుంది?
4. నిరాహార దీక్ష: లాక్‌డౌన్ వల్ల అంతా ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి.. వారంలో కనీసం ఒకరోజైనా నిరాహార దీక్ష చేద్దాం. ఆ రోజు తక్కువ పని, విశ్రాంతితో ఈ దీక్ష చేపడదాం. ఇలా చేయడం వల్ల మనం పరోక్షంగా పేదలకు మేలు చేసినవాళ్లం అవుతాం. వారికి కనీసం ఒక రోజు ఆహారం లభిస్తుంది. అలాగే, వారంలో ఒకసారి ఉపవాసం చేయడం దైవకార్యం. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదే.

Also Read: కళ్ల కింద నల్లటి వలయాలు? ఈ చిట్కాలు పాటిస్తే.. లాక్‌డౌన్ పూర్తయ్యేలోపు మాయం!

5. విశ్వాసం.. ప్రేమ.. ఓర్పుతో..: గాంధీ మహాత్ముడు చెప్పినట్లు.. నమ్మకం, విశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఈ సూత్రంతోనే ఇండియా గతంలో ప్లేగు, స్మాల్ పాక్స్, పోలియో, స్పానిష్ వైరస్‌లను ఎదుర్కొని నిలబడగలిగాం. అదే విశ్వాసంతో ఇప్పుడు కోరానాను కూడా ఎదుర్కొందాం. అలాగే, ఇతరులను ద్వేషించకుండా ప్రేమతో, కులమత బేధాలు, అసమానతలు లేకుండా సామరస్యంతో ఐక్యంగా వైరస్‌పై పోరాడుదాం. ఓర్పుతో.. సానుకూల వైఖరితో.. నిరాడంబరంగా వైరస్‌ను తరిమికొట్టి.. స్వేచ్ఛను పొందుదాం.

వీడియో:

samayam teluguSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *