gautam kitchlu: Kajal: పెళ్లి, హనీమూన్ తర్వాతే అన్నీ.. ఇప్పుడు ఛాన్సే లేదు! కాజల్ అగర్వాల్ స్ట్రాంగ్ డిసీజన్ – kajal aggarwal strong decision on her shootings after marriage


ఉన్నట్టుండి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బాంబ్ పేల్చింది. తన సీక్రెట్ లవ్ గురించి బయటపెట్టి ఏకంగా పెళ్లి ముహూర్తం కూడా చెప్పేసింది. అక్టోబర్ 30వ తేదీన కాజల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నట్లు సర్‌ప్రైజ్ చేయడంతో ఆమె అభిమానులు హుషారెత్తిపోయారు. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన ఆ క్షణాన్ని కాజల్ స్వయంగా ప్రకటించడంతో పండగ చేసుకుంటున్నారు. దీంతో కాజల్- గౌతమ్ కిచ్లు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాల విషయమై కాజల్ ఓ స్ట్రాంగ్ డిసీజన్ తీసుకున్నాడని తెలుస్తోంది.

ఇన్నాళ్లు పర్సనల్ లైఫ్‌ని చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కాబోయే వాడితో కలిసి పెళ్లికి సంబంధించిన చర్చల్లో మునిగిపోయిందట. కారోనా కారణంగా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పెళ్లి సమయం మరీ దగ్గర పడటంతో ప్రస్తుతం కాజల్ తన ఫ్యామిలీతో బిజీబిజీగా ఉందట. పెళ్లికి కావాల్సిన అన్నింటినీ షాపింగ్‌ చేయడంతో పాటు పెళ్లికి రాబోయే బంధువుల కోసం స్పెషల్ ఏర్పాట్లు చేయిస్తోందట.

Also Read: ఆ రెండు రోజులు చాలా భయమేసింది.. ఇటలీలో పడిన ఇబ్బందులపై పూజా హెగ్డే ఓపెన్

పెళ్లి సమయం చాలా దగ్గరపడటంతో తన సినిమా షూటింగ్స్ సంగతులను పక్కనబెట్టి కేవలం పెళ్లి పనులు మాత్రమే చూసుకుంటోందట కాజల్. ఓ వైపు పెళ్లి పనులు ఉండగా తన సినిమా షూటింగ్స్ జోలికి వెళ్లొద్దని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిందట. అందుకే తన కొత్త సినిమా షూటింగ్స్ అన్నీ కూడా పెళ్లి చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యాకే పెట్టుకోవాలని ఆమె డిసైడ్ అయిందట. టెన్షన్ అస్సలు అవసరం లేదని.. పెళ్ళై, హనీమూన్ వెళ్లొచ్చాకే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని ఆమె అనుకుంటుంటున్నట్లు కాజల్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: లావణ్య త్రిపాఠి వేలికి రింగ్.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? సీక్రెట్ రివీల్

మరోవైపు కాజల్‌కి ‘ఆచార్య’నే చివరి సినిమా అనే టాక్ వినిపిస్తోంది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ చెప్పినప్పటికీ ఇకపై ఆమె సినిమాల్లో నటించదు అనే రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హీరోగా తెరకెక్కుతున్న `ఇండియన్-2`, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` సినిమాలకు కమిటై ఉంది కాజల్. సో.. చూడాలి మరి పెళ్లి తర్వాత అమ్మడి రూటు ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది!.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *