ghee while pregnancy: గర్భిణీలు నెయ్యి తినొచ్చా… నిపుణులు ఏమంటున్నారు.. – is ghee good for pregnants know here benefits know here all details


ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవ్వగానే అమ్మ, అమ్మమ్మ, అత్త, పిన్ని అందరూ ఒకటే చెప్తారు. ఇక నుండీ ఫుడ్ హాబిట్స్ మారాలి, అని. ఏది మంచిదో మాకు తెలుసు, మేం చేసి పెట్టింది తినడమే నీ పని అంటారు. ఆ రోజు రాత్రి చపాతీ మీద నెయ్యి ఉంటుంది. మర్నాడు నెయ్యితో చేసిన పొంగలి టిఫిన్. సాయంత్రం స్నాక్ కి నేతితో చేసిన లడ్డూ. అసలు ప్రెగ్నెన్సీ టైం లో నెయ్యి తినచ్చా అని డౌట్ వస్తుంది, కదా. దాని గురించే ఇక్కడ చదివేయండి.

Also Read : కరోనా వచ్చినవారు ఇంట్లోనే ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చా..

ప్రెగ్నెన్సీ టైం లో నెయ్యి తినడం మంచిదేనా?

మంచిదే. నెయ్యి తొందరగా అరుగుతుంది, మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. అయితే, మీరు బరువు ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి తినాలి. నెయ్యి ని ఆయిల్, బటర్ కంటే హెల్దీ సబ్స్టిట్యూట్ గా భావిస్తారు. అయితే, లిమిటెడ్ గా తీసుకున్నంత వరకూ ఏం పరవాలేదు.

ఎంత తీసుకోవాలి?

ప్రెగ్నెన్సీ టైం లో రోజుకి రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి హాయిగా తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మీరు నెయ్యి తీసుకోవచ్చు.

బెనిఫిట్స్ ఏమిటి?

నెయ్యి లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. నెయ్యి తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : సూర్య నమస్కారాలు చేస్తే ఏమేం లాభాలు.. బరువు తగ్గుతారా..

1. నెయ్యి లో యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి అరుగుదలకి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే బ్యుటిరేట్ అనే ఒక ఫ్యాటీ ఆసిడ్ గట్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది.
2. నాలుగవ నెల నుండి, బేబీ పుట్టే వరకూ మీకు కనీసం మూడు వందల క్యాలరీలు ఎక్కువ కావాలి. అప్పుడే బేబీ డెవలప్మెంట్ బావుంటుంది. నెయ్యి బేబీ గ్రోత్ కీ బ్రెయిన్ డెవల్ప్మెంట్ కీ హెల్ప్ చేస్తుంది.
3. పోషణ
నెయ్యి ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్ ఇస్తుంది. బాడీ నరిష్మెంట్ కి నెయ్యి నాచురల్ గా సహాయ పడుతుంది. నెయ్యి బాడీని స్ట్రాంగ్ గా, వార్మ్ గా ఉంచుతుంది.

woman-enjoying-pregnancy-at-home-picture-id1129026919

ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్…

నెయ్యి రోజుకి రెండు మూడు టీ స్పూన్స్ వరకు తీసుకుంటే ఏ హానీ లేదు. కానీ అంత కంటే ఎక్కువ అయితే మాత్రం తల్లీ, బిడ్డా కూడా బరువు పెరుగుతారు. ప్రెగ్నెన్సీ చివరి వారాల్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గుతుంది. అన్నీ కలిపి నార్మల్ డెలివరీ ని డిఫికల్ట్ చేయవచ్చు. నెయ్యి ఎక్కువ తీసుకుంటే డెలివరీ తరువాత మామూలు బరువు కి రావడం కొంచెం కష్టమౌతుంది.

Also Read : అన్ని విషయాలు మర్చిపోతున్నారా.. అయితే జాగ్రత్త ఈ సమస్య ఉందేమో..

జాగ్రత్తలు:

1. వీలున్నంత వరకూ ఇంట్లో తయారు చేసిన నెయ్యినే వాడండి.
2. మీరు సరైన బరువే ఉండి, తాజా పండ్లూ, కూరగాయలూ తీసుకుంటూ ఉన్నప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు.

ఆయుర్వేదం ఏం చెబుతోంది…

ఆయుర్వేదం లో నెయ్యి కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్వచ్చమైన ఆవు నేతిని కాచిన పాలలో కలిపి, అందులోనే ఒకట్ రెండు చుక్కలు కుంకుమ పువ్వు, మూడు నాలుగు చుక్కలు తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే ఇమ్యూనీటీని బూస్ట్ చేసి, బేబీ యొక్క బ్రెయిన్ హెల్త్ ని ప్రమోట్ చేసి, సేఫ్ డెలివరీకి సాయపడుతుందని చెప్తారు.
అయితే, మీ డైట్ లో ఏం చేంజెస్ చేసుకోవాలనుకున్నా మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ తరువాతే చేయండి. నెయ్యి తీసుకునే విషయం లో అయినా మీ డాక్టర్ యొక్క సూచనల ప్రకారం చేయండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *