ginger tea side effects: అల్లం చాయ్ అతిగా తాగితే ఏమవుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? – too much of ginger tea has these side effects


రోనా వైరస్ నేపథ్యంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రతి ఒక్కరిలో రోగ నిరోధక శక్తి పెరగాలనే లక్ష్యంతో చాలారకాల ఆహారాలను తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఔషద గుణాలు కలిగిన ఆహారానికి ప్రధాన్యం ఇస్తున్నారు. నిమ్మకాయ నుంచి వెల్లులి వరకు దేన్ని వదలకుండా తమ రోజువారీ డైట్‌లో వాటిని భాగంగా మార్చుకుంటున్నారు. ‘అల్లం’ వినియోగం కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా అల్లం చాయ్ తాగేవాళ్లు.. రోగ నిరోధక శక్తి కోసం కాస్త మోతాదు మించి మరీ తీసుకుంటున్నారు. మరి, అల్లం చాయ్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? అతిగా అల్లం టీ తాగితే ఏర్పడే సమస్యలు ఏమిటీ? తదితర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అతిసారం సమస్య: వైద్యులు, ఆహార నిపుణులు, భారతీయ ఆయుర్వేదాల ప్రకారం.. అల్లం ఆరోగ్యానికి మంచిదే. కానీ, అది మోతాదు మించనంత వరకే. అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని.. అదే పనిగా తినేస్తుంటే అది కొత్త సమస్యలను పరిచయం చేయొచ్చు. మనం తినే ఆహారం జీర్ణమై మలంగా మారుతుందనే సంగతి తెలిసిందే. అల్లం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మలం పేగుల ద్వారా వేగం బయటకు వెళ్లేందుకు సహకరిస్తుంది. దీనివల్ల కడుపులో గుడగుడలు పెరుగుతాయి. ఈ పరిస్థితి డయేరియా(అతిసారం) సమస్యకు దారితీయోచ్చు.

గర్భిణీలకు మంచిది కాదు: అల్లం విషయంలో గర్బిణీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1500 గ్రాముల కంటే ఎక్కువ అల్లాన్ని ఆహారంగా తీసుకున్నట్లయితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. అందుకే, గర్భిణీలు అల్లాన్ని ఎక్కువగా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం వైద్యుల సూచన తర్వాతే దీన్ని తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి.

రక్తస్రావం జరగొచ్చు: అల్లంలో యాంటీ ప్లేట్‌లెట్ గుణాలు కూడా ఉన్నాయి. అతిగా అల్లం తిన్నట్లయితే రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వెల్లులితో కలిపి అల్లాన్ని తీసుకుంటే ఈ ముప్పు మరింత ఎక్కువ. అల్లం రక్తాన్ని చిక్కగా మార్చుతుంది. మీకు ఒక వేళ రక్తం గడ్డ కట్టం లేదా రక్త స్రావం వంటి సమస్యలు ఉన్నట్లయితే.. అల్లం మరింత తీవ్రతరం చేస్తుంది.

గుండెలో మంట: అల్లంలో యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనల్లో తేలింది. కానీ, అల్లాన్ని అతిగా తీసుకుంటే గుండెల్లో మంట, ఇరిటేషన్ ఏర్పడుతుందని మరికొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. అల్లం కడుపులో మరింత ఎక్కువ యాసిడ్ విడుదలకు ప్రేరేపిస్తుందని తెలిపాయి. కాబట్టి.. అల్లాన్ని అతిగా తినొద్దు.

రక్తపోటుపై ప్రభావం: కొన్ని అధ్యయనాలు అల్లం రక్తపోటును తగ్గిస్తుందని పేర్కొన్నాయి. రక్తపోటు(హై-బీపీ)తో బాధపడుతున్న రోగులకు ఇది మంచి విషయమే. కానీ, సాధారణ వ్యక్తులు లేదా లో-బ్లడ్ ప్రెజర్ (లో-బీపీ) సమస్యతో బాధపడేవారుకు మాత్రం ఇది చాలా డేంజర్. అల్లం టీ తాగిన తర్వాత వీరిలో అలసట లేదా వీక్‌నెస్ ఏర్పడవచ్చు.

Read Also: ఉదయం వేళ అంగం స్తంభిస్తుందా? మీ గుండె జాగ్రత్త!

జుట్టు మళ్లీ పెరగదట: ఓ చైనా అధ్యయనం ప్రకారం.. అల్లం అతి వినియోగం జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిసింది. మీరు బాగా పొడవుగా జుట్టు పెంచుకోవాలన్నా, జుట్టు రాలే సమస్య లేదా బట్టతలతో బాధపడుతున్నా.. అల్లం లేదా అల్లం టీని అతిగా తీసుకోవడం తగ్గించడం మంచిది. అల్లం అతిగా తీసుకోవడం వల్ల జుట్టు తిరిగి పెరగడం ఆగిపోతుందట.

Read Also: ఈ 8 రాశులవారు తమ భాగస్వామిని చీట్ చేస్తారట, ఎందుకంటే..

ముఖ్య గమనిక:ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. పలు అధ్యయనాల్లో తేలిన అంశాలను మీకు తెలియజేయడానికే ఈ కథనం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నా లేదా మరింత సమాచారం తెలుసుకోవాలన్నా తప్పకుండా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించాలని మనవి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *