gold loan: రైతులకు గుడ్ న్యూస్.. రూ.లక్ష రుణానికి నెలకు రూ.580 చెల్లిస్తే చాలు! – indian bank cuts interest rate on gold loans for farmers, check new rates here


ప్రధానాంశాలు:

  • అన్నదాతలకు గోల్డ్ లోన్స్
  • రుణ రేట్లు తగ్గింపు
  • చౌక వడ్డీకే రుణాలు

ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ తాజాగా రైతులకు శుభవార్త అందించింది. రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్ అందిస్తోంది. వడ్డీ రేట్లను 7 శాతానికి తగ్గించింది. ఇదివరకు వడ్డీ రేట్లు 7.5 శాతంగా ఉండేవి. అంటే బ్యాంక్ వడ్డీ రేట్లలో 50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిందని చెప్పుకోవచ్చు.

కరోనా వైరస్ నేపథ్యంలో రైతులకు సులభంగా తక్కువ వడ్డీకే రుణాలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ బ్యాంక్ తెలిపింది. జూలై 22 నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని పేర్కొంది. అగ్రికల్చర్ జువెల్ లోన్స్‌కు 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే మీరు రూ.లక్ష రుణం తీసుకుంటే నెలకు రూ.583 చెల్లిస్తే సరిపోతుంది.

Also Read: 56 లక్షల మందికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు అందుబాటులోకి!

కేవలం ఇండియన్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇంకా చాలా బ్యాంకులు గోల్డ్ లోన్స్ అందిస్తున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రైతులకు సులభంగానే బంగారు రుణాలు అందిస్తోంది.

ఇకపోతే బ్యాంక్‌కు వెళ్లి లోన్ తీసుకోవాలని భావిస్తే.. కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఇవి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తాయి. అలాగే రైతులు పొలం పాస్ బుక్ జిరాక్స్ కూడా ఇవ్వాలి. మీరు పెట్టే బంగారంపై 85 శాతం వరకు మొత్తాన్ని పొందొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *