gold rate today: Gold Price: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి వెలవెల.. లేటెస్ట్ రేట్లు ఇలా! – today 22ct 24ct gold silver rate in hyderabad 14th may 2020


ప్రధానాంశాలు:

  • బంగార ధర కిందకు
  • వెండిదీ ఇదే దారి
  • గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పైకి

పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర తగ్గింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ఈ రోజు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగానా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి వెలవెలబోవడం గమనార్హం. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 దిగొచ్చింది. రూ.44,370కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే స్వల్పంగానే క్షీణించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.47,400కు దిగొచ్చింది.

Also Read: PF ఖాతాదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త.. 72 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం!

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.50 మేర దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.42,950కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ తీపికబురు.. 2 కీలక నిర్ణయాలు!

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.57 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1726.00 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.73 శాతం పెరుగుదలతో 15.78 డాలర్లకు ఎగసింది.

Also Read: రోజుకు రూ.100తో చేతికి ఏకంగా రూ.10 కోట్లు.. ఇలా చేయండి!

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పడిపోయింది. రూ.44,950కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. రూ.46,950 వద్దనే స్థిరంగా ఉంది. అయితే కేజీ వెండి ధర మాత్రం రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.42,950కు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *