gold rate today : Gold Price: గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఢమాల్! – today 22ct 24ct gold silver rate in hyderabad 9th april 2020


బంగారం ధర పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ఈ రోజు పడిపోయింది. బంగారం వెలవెలబోయింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారం ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది.


హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. రూ.44 వేల మార్క్ కిందకు వచ్చేసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గుదలతో రూ.43,800కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.130 తగ్గుదలతో10 గ్రాములకు రూ.40,030కు దిగొచ్చింది.

Also Read: SBI ఖాతాదారులకు భారీ షాక్.. 44 కోట్ల మంది కస్టమర్లపై ఎఫెక్ట్!

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.330 తగ్గింది. దీంతో వెండి ధర రూ.40,950కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Also Read: ఆ ఆప్షన్‌తో PF డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.. ఎలా అంటే?

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.21 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర 1700 డాలర్ల కిందకు వచ్చేసింది. 1680.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 15.24 డాలర్లకు చేరింది.

Also Read: Tax చెల్లింపుదారులకు మోదీ గుడ్ న్యూస్.. వెంటనే రూ.5 లక్షలు విడుదల!

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.42,170కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.120 తగ్గుదలతో రూ.44,500కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.330 తగ్గింది. దీంతో ధర రూ.40,950కు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *