gold rate today: Gold Price: బంగారం ప్రియులకు శుభవార్త.. స్వల్పంగా పెరిగిన ధర – today 22ct 24ct gold silver rate in hyderabad vijayawada telangana 20th may 2020


కరోనా లాక్ డౌన్‌ ప్రభావం అన్ని వ్యాపారాలపై పడిన… బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పెరిగి కొండెక్కి కూర్చుంటున్నాయి. బులియన్ మార్కెట్లలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. స్వల్పంగా మాత్రమే ధరలు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి రూ.45920కు చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 48,990 గాఉంది. అయితే వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండీ రూ. 840 తగ్గి రూ.47660కు చేరింది. మంగళవారం మాత్రం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండీ రూ. 48500గా ఉంది.

మరోవైపు విజయవాడలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.45920గా ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 48990గా ఉంది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ప్రస్తుతం నగరంలో కిలో వెండి రూ. 47660గా ఉంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,960గా ఉంది.

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా జపాన్‌ దేశాల బలహీన ఎకనమిక్‌ డేటా ఇవన్నీ పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై ఎఫెక్ట్ పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్‌ బంగారం ధర 2వేల డాలర్లు తాకినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక దేశీయంగా 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 50వేల తాకొచ్చని అభిప్రాయపడుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *