Green tea benefits: డైటింగ్ చేయకుండా గ్రీన్ టీ మాత్రమే తాగితే బరువు తగ్గుతారా.. – is green tea reduce belly fat and weight know here full details


గ్రీన్ టీ ని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. గ్రీన్ టీ లో ఉన్న కెఫీన్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెటబాలిజం బాగా బూస్ట్ అయ్యి కొవ్వుల్ని తొందరగా ప్రాసెస్ చేయగలదని స్టడీస్ వలన తెలుస్తోంది. రోజుకి 100 కేలొరీల దాకా కరిగించి, బెల్లీ ఫ్యాట్ ని తగ్గించే ఈ డీటాక్స్ డ్రింక్ ని రోజుకి రెండు సార్లు తాగండి.

​గ్రీన్ టీ బరువు తగ్గిస్తుందా..

samayam telugu

ఇప్పుడు అంతటా డైట్ ప్లాన్స్, డైటింగ్ పద్ధతులూ, డైట్ సలహాలూ – వీటిలో ఏది ఎంచుకోవాలో తెలియని పరిస్థితి. రాపిడ్ వెయిట్ లాస్‌ని ప్రామిస్ చేసే ఖరీదైన ప్లాన్స్‌ని మర్చిపోండి. బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా తగ్గించడానికి ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి చాలు. గ్రీన్ టీ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకి తెలుసు. గ్రీన్ టీ లో ఉన్న కెఫీన్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెటబాలిజం బాగా బూస్ట్ అయి కొవ్వుల్ని తొందరగా ప్రాసెస్ చేయగలదని స్టడీస్ వల్ల తెలుస్తోంది.

​గ్రీన్‌టీలోని హెల్త్ బెనిఫిట్స్..

samayam telugu

డైట్ లో ఎలాంటి మార్పులూ చేయకుండా కేవలం గ్రీన్ టీ రెగ్యులర్‌గా తాగడం వల్ల కొంత మంది బరువు తగ్గిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. గ్రీన్ టీ లో ఉన్న ఫ్లేవనాయిడ్స్, కెఫీన్ వల్ల శరీరం వాడుకునే ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం గ్రీన్ టీ వల్లే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ, అందులో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే తయారయ్యే డీటాక్స్ డ్రింక్ శరీరంలోని టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తుంది. ఇందులో ఎలాంటి కేలొరీలూ ఉండవు, కేవలం మెటబాలిజంని బూస్ట్ చేసే గుణాలు తప్ప.

​ఎందుకు తాగాలంటే..

samayam telugu

క్లెన్స్ చెయ్యడం, డీటాక్స్ చేయడం హెల్దీ బాడీకీ, మైండ్‌కీ చాలా అవసరం. బరువు తగ్గడానికీ, అదుపులో ఉంచుకోవడానికీ ఇది ఇంకా అవసరం. ఇది లివర్ ని క్లెన్స్ చేసి అందులోని టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తుంది. కిడ్నీలూ, లంగ్స్, ఇంటెస్టైన్స్, స్కిన్ ద్వారా కూడా టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి.

Also Read : కరోనా వైరస్‌కి మందుగా పొగాకు పనిచేస్తుందా.. వ్యాక్సిన్ రెడీ చేస్తున్న శాస్త్రవేత్తలు..

​ఎలా తయారు చేయాలంటే..

samayam telugu

– ఒక కప్పు నీరు మరిగించి అందులో ఒక గ్రీన్ టీ బాగ్ వెయ్యండి.

– ఒక పావుచెక్క నిమ్మరసం అందులో పిండండి.

– మీకు అవసరమనుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ తేనె కలుపుకోండి.

– ఇలా తయారైన గ్రీన్‌టీని ఆస్వాదించండి.

Also Read : హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఒకటేనా.. ఈ వ్యాధికి మందు ఉందా..

​ఎన్ని సార్లు తాగొచ్చు..

samayam telugu

మంచి రిజల్ట్ పొందడానికీ, సుమారు 100 కేలొరీలు కరిగించడానికీ దీన్ని రోజుకి రెండు మూడు సార్లు తాగండి. గ్రీన్ టీ లోనూ, నిమ్మరసం లోనూ ఉండే కొవ్వు కరిగించే గుణాల వల్ల ఇవి రెండూ కూడా డైట్ చేసేవారి ఫేవరేట్స్. గ్రీన్ టీ లో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇంకా ఇరిటేట్ అయి ఉన్న చర్మానికి చల్లదనం చేకూరుస్తాయి. ఇందులో ఉండే యాంటీ-ఏజింగ్ ప్రాపర్టీస్ ముడతలు రాకుండా చేస్తాయి.

Also Read : బాడీలో ఇమ్యూనిటీ పెంచి.. అందంగా కూడా మార్చే జ్యూస్ ఇదే…

​నిమ్మకాయ ఎందుకు కలపాలంటే..

samayam telugu

అలాగే, నిమ్మకాయలో కూడా విటమిన్ సి, బరువు తగ్గడానికి కావాల్సిన ఇతర న్యూట్రియెంట్స్ ఉన్నాయి. నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలలో స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గించడం, ఆస్థ్మా రాకుండా చూడడం, కాన్సర్ కారకాలతో పోరాడడం వంటివి కూడా ఉన్నాయి. నిమ్మకాయ లాంటి ప్లాంట్ ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకోడం వల్ల డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ డిసీజ్ వంటివి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. కాబట్టి మార్కెట్లో దొరికే డ్రింక్స్ బదులుగా రుచికరమైన ఈ డీటాక్స్ డ్రింక్ తాగండి. ఆరోగ్యంగా ఉండండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *