HDFC Bank loan: బజాజ్ బైక్స్ కొనేవారికి బంపరాఫర్.. సులభంగానే రుణం.. ఇంటి నుంచే అప్లై చేసుకోవచ్చు! – bajaj auto launches special finance scheme with private lender hdfc bank


ప్రధానాంశాలు:

  • బజాజ్ టూవీలర్ కొనేవారికి తీపికబురు
  • సులభంగానే లోన్
  • ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు

కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. టూవీలర్ కొనుగోలు చేసే వారికి సులభంగానే రుణం పొందే ఛాన్స్ ఒకటి అందుబాటులో ఉంది. అయితే ఇది అన్ని బైక్స్‌కు అందుబాటులో లేదు. కేవలం బజాజ్ టూవీలర్లు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో బజాజ్ పల్సర్, డామినర్ వంటి పలు బైక్స్ కొనేవారికి ప్రయోజనం కలుగనుంది.

బజాజ్ ఆటో కంపెనీ తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో జతకట్టింది. ఇందులో భాగంగా బజాజ్ బైక్స్ కొనుగోలు చేసే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సులభంగానే రుణాలు అందిస్తోంది. దీంతో కొత్తగా బైక్ కొనేవారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని బైక్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్.. లేటెస్ట్ రేట్లు ఇలా!

అంతేకాకుండా బైక్ కొనేందుకు లోన్ తీసుకోవాలనుకునే వారు బజాజ్ డీలర్‌షిప్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కోవిడ్ 19 లేదా కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీ, బ్యాంక్ ఈ మేరకు ఈ సర్వీసులు అందిస్తోంది.

బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటార్‌సైకిల్స్) సరాంగ్ కనడే మాట్లాడుతూ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో తాము భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ 19 సమయంలో కస్టమర్లకు ఆర్థిక తోడ్పాడు అందించడం మంచి విషయమన్నారు. తాజా డీల్‌తో కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుకుంటామని పేర్కొన్నారు. దేశవ్యాప్తగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *