HDFC Bank MCLR : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త.. రుణ గ్రహీతలకు తీపికబురు! – private lender hdfc bank cuts lending rate by 0.20%


దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింట్ రేటు (ఎంసీఎల్ఆర్)లో 0.2 శాతం కోత విధిస్తున్నట్లు బ్యాంక్ తాజాగా ప్రకటించింది.


బ్యాంక్ తాజా రేట్ల కోతతో ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.6 శాతానికి దిగొచ్చింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.95 శాతానికి తగ్గింది. బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు ప్రాతిపదికనే ఎక్కువగా రుణాలు అందిస్తూ ఉంటుంది. అలాగే మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతంగా ఉంది. ఏప్రిల్ 7 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి.

Also Read: గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. పడిపోయిన వెండి!

రిజర్వు బ్యాంక్ కీలక రెపో రేటును గత నెలలో 0.75 శాతం తగ్గించడం వల్ల బ్యాంకులు అన్నీ కూడా ఎంసీఎల్ఆర్ రేటును తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో లోన్ తీసుకున్ వారిపై ఈఎంఐ భారం దిగివస్తుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు వాటి వాటి ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధించాయి.

Also Read: PF అకౌంట్‌తో పాన్ కార్డు కచ్చితంగా లింక్ చేసుకోవాలా? లేదంటే ఏమౌతుంది?

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్)ను తగ్గించేసింది. ఏకంగా 35 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అన్ని కాల పరిమితుల్లోని రుణాలకు ఇది వర్తిస్తుంది.

ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేట్ల తగ్గింపు నిర్ణయం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా 11వ సారి కావడం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు వల్ల బ్యాంక్ నుంచి ఎంసీఎల్ఆర్ లింక్డ్ ఫ్లోటింగ్ రేటుతో రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలుగుతుంది. అంటే హోమ్ లోన్ వంటివి తీసుకున్న వారికి బెనిఫిట్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 7.4 శాతానికి దిగొచ్చింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *