healthy food for kids: పిల్లలకి ఈ ఆహారం పెట్టండి.. ఎంతో హెల్దీ.. – the top healthiest foods for kids know here all details


పిల్లలకి ఐస్ క్రీం పెట్టటం కంటే ఇడ్లీ, కిచిడీ పెట్టటం మంచిదని మనందరికీ తెలుసు. వాళ్ళు ఐస్ క్రీం తిన్నట్టు కిచిడీ తినరని కూడా మనందరికీ తెలుసు. మనం తినమని పెట్టింది వాళ్ళు తినరు. వాళ్ళు తినేలా ఉండాలీ, అది వాళ్ళకి మంచిదవ్వాలీ అంటే ఏం చేయాలి.. ఏం పెట్టాలి.. వాళ్ళకి న్యూట్రిషస్ ఫుడ్ కావాలి – బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా ఉండడానికి హెల్దీ ఫ్యాట్స్ కావాలి, బోన్స్ కోసం కాల్షియం కావాలి, కూరగాయల్లో ఉండే మినరల్స్, విటమిన్స్ కావాలి, ఇంకా ఎన్నో కావాలి. ఇలా పిల్లలకి పెట్టడానికి మంచి ఫుడ్స్ ఏవి, వాటిని వాళ్ళ చేత తినిపించడం ఎలా? ఇలాంటి సందేహాలు మీకు ఉంటే ఆలస్యం ఎందుకు మీరు ఈ విషయాలు తెలుసుకోండి..

1. యోగర్ట్

బ్రేక్‌ఫాస్ట్ గా, స్నాక్ గా, డిసర్ట్ గా ఎలా అయినా యోగర్ట్ పిల్లలకి ఇవ్వచ్చు. అది హెల్దీ గా ఉంటుంది, పొట్ట నిండుతుంది, విటమిన్ డీ, ప్రోటీన్స్ ఉంటాయి. యోగర్ట్ లో ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇది బాడీలో హెల్దీ బాక్టీరియాని పెంచుతుంది. ఇందులో చూసుకోవలసిందల్లా పంచదార కలపకూడదు కదా అని. అందుకని, ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ తీసుకుంటే అందులో షుగర్ ఉండదు, పైగా రెగ్యులర్ యోగర్ట్ కంటే డబల్ ప్రొటీన్ ఉంటుంది. దానిలో మీ పిల్లలకు నచ్చిన పండ్ల ముక్కలు వేస్తే వాళ్ళూ ఇష్టం గా తింటారు.

2. బీన్స్

బీన్స్ చాలా మంచి ఫుడ్, కానీ, దీనిని తినేందుకు పిల్లలు అంతగా ఇంట్రెస్ట్ చూపరు. వీటిలో ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. అన్ని వేళలా దొరుకుతాయి. వాటితో ఏమైనా ప్రిపేర్ చేయడం కూడా తేలిక. బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, చిక్ పీస్ లాంటి కాండ్ బీన్స్ ఏవైనా తీసుకోండి. కాన్ ఓపెన్ చేసి ఒక్కసారి కడిగేస్తే సరిపోతుంది. వీటిని పాస్తా తో గానీ, మాంసం తో గానీ కలిపి తినిపించొచ్చు. దీనివల్ల పిల్లలకి లీన్ ప్రోటీన్ అందుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ పిల్లలకి కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది.

Also Read : వాటర్ బాటిల్‌లోని నీరు తాగుతున్నారా.. అయితే, మీకోసమే..

3. ఎగ్స్

ఒక ఎగ్ లో 6 గ్రాముల ప్రోటీన్ తో పాటూ, విటమిన్ డీ, విటమిన్ బీ12, ఐరన్ ఉంటాయి. కొన్ని ఎగ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ టైం లో పేస్ట్రీస్, ఫ్రీడ్ ఫుడ్స్ అన్నీ వదిలేసి హాయిగా మీ పిల్లలకి స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసిపెట్టండి. వాళ్ళు స్క్రాంబుల్డ్ ఎగ్స్ తినకపోతే ఎగ్ సలాడ్ లాంటివి ట్రై చెయ్యండి.

4. అవకాడో

పిల్లలకి హెల్దీ ఫ్యాట్స్ అందించడానికి అవకాడో చాలా చక్కటి ఆప్షన్. ఇందులో మోనో అన్ సాచురేటెడ్ ఫాట్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ హెల్దీ గా ఉంటాయి. దీనిలో ఉండే ఇంకో బెస్ట్ పాయింట్ – దీన్ని ఎలా అయినా తినొచ్చు. స్పూన్ తో తీసుకుని తినచ్చు, స్మూతీలో వెయ్యచ్చు, చికెన్ లో కలపచ్చు…

samayam telugu

kids foo toi

5. చిలగడ దుంప

న్యూట్రిషస్ ఫుడ్ కావాలి కానీ చేసేంత టైం లేదా? చిలగడ దుంపల్ని శుభ్రం గా కడిగేసి, ఫోర్క్ తో కొన్ని హోల్స్ పెట్టి మూడు నించీ ఐదు నిమిషాల పాటు మైక్రోవేవ్ చెయ్యండి. బైటికి తీసి చల్లారనిచ్చి మీ పిల్లలకి పెట్టండి, మీరూ తినండి. చిలగడ దుంప ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందులో విటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం పుష్కలం గా ఉన్నాయి.

6. పాలు

మిల్క్ లో ఉన్న కాల్షియం, విటమిన్ డీ వల్ల మిల్క్ బోన్స్ కి చాలా మంచిది. సంవత్సరం లోపు పిల్లలకి ఆవు పాలు ఇవ్వకూడదు. రెండేళ్ల తర్వాత పిల్లలు లో-ఫాట్ మిల్క్ ఒకసారీ, యోగర్ట్ ఒకసారీ, చీజ్ ఒకసారీ తీసుకోవచ్చు. పిల్లలకి సోయా మిల్క్ లాంటివి కూడా ఇవ్వొచ్చు, కానీ ఒక్కసారి లేబుల్ చూసి మీ డాక్టర్ తో మాట్లాడి ఇవ్వండి.

Also Read : నిమ్మకాయ నీరు గోరువెచ్చగా తాగితే మంచిదా.. చల్లగా తాగాలా..

7. నట్స్ అండ్ సీడ్స్

ఫైబర్, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ కావాలంటే నట్స్, సీడ్స్ గురించే ఆలోచించాలి. జీడిపప్పులూ, వాల్‌నట్స్, బాదం పప్పులూ, సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ కలిపి పిల్లలకి ఇవ్వొచ్చు. వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫాట్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్స్ ఆహారం లోనే ఉంటాయి. బాడీ వాటిని తయారు చేసుకోలేదు. వీటిని ఎండు పళ్ళతో కలిపి తీసుకోవచ్చు, స్మూతీస్ చేసుకోవచ్చు, ఎనర్జీ బార్స్ కూడా తయారు చెయ్యచ్చు.

8. హోల్ గ్రెయిన్స్

హోల్ గ్రెయిన్స్ అంటే తృణ ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్, హోల్-వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్ లాంటివి పిల్లలకి పెట్టొచ్చు. హోల్-వీట్ ఫ్లోర్ తో తయారు చేసిన చపాతీలు కూడా పెట్టచ్చు.

9. బెర్రీస్

బెర్రీస్ లో విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రా బెర్రీస్ లో షుగర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటిని అలాగే అయినా తినచ్చు, లేదా యోగర్ట్ తో కలిపి అయినా తీసుకోవచ్చు.

10. కూరగాయలు

ఇవి ఎవ్వరికీ ఇష్టం ఉండవు. మనకే నచ్చక పోతే పిల్లలకేం పెడతాం. కానీ అది సరైన పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. ఎన్ని ఎక్కువ రంగుల్లో ఉన్న వెజిటబుల్స్ తింటే అంత మంచిది. పాలకూర వంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటే, ఆరెంజ్ మరియూ రెడ్ కలర్ లో ఉండే వెజిటబుల్స్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. పెప్పర్స్ లో విటమిన్ సీ ఉంటుంది. బ్రకోలీ, కాబేజ్, కాలీ ఫ్లవర్ లాంటి వాటిలో కాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి.

Also Read : సర్వికల్ స్పాండిలోసిస్‌ని తగ్గించే చిట్కాలివే..

ఫ్రిజ్ లో కారెట్, దోసకాయల వంటివి కట్ చేసి పెట్టుకుంటే స్నాక్ గా తినచ్చు. మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే పిల్లల చేత గార్డెనింగ్ చేయించండి. వాళ్ళు పెంచిన మొక్కల తాలూకు కూరలు అంటే పిల్లలు ఇష్టం గా తినేస్తారు. బెండకాయ, వంకాయ, టమాటాల్లాంటివి ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు.

samayam telugu

kids feeding times of india

ఇవన్నీ మీ పిల్లల చేత ఎలా తినిపించడం అని చూస్తున్నారా. ఆ పాయింట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి.

1. ఓ ప్లేట్ ని గైడ్ గా తీసుకోండి. అందులో సగం పళ్ళూ, కూరలూ, పావు వంతు చపాతీ, అన్నం, బ్రెడ్ లాంటివి, మిగిలిన పావూ ఎగ్స్, మీట్, చీజ్ లాంటి వాటితో ఉండేటట్లు చూసుకోండి.

2. మీరు కొంచెం వెరైటీ గా చేసి పెడితే పిల్లలు కూడా తినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.

3. వంటలో వాళ్ళ వయసుని బట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు తినడానికి అన్ని పేచీలు పెట్టరు.

4. వాళ్ళ తో పాటూ మీరు కూడా హెల్దీ ఫుడ్స్, స్నాక్స్ తీసుకోండి.

5. వాళ్ళు ఏదైనా ఒక పదార్ధం తినమని గొడవ చేస్తుంటే మరీ బలవంత పెట్టకండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *