home decor News : వర్షాకాలంలో చెట్లు బాగా పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి.. – tips for grow organic vegetables home indoor farming in monsoon


వర్షాకాలం వచ్చేసింది. పచ్చదనం తో ప్రకృతి పరవశిస్తోంది. ఎటు చూస్తే అటు హరిత వర్ణం కనువిందు చేస్తోంది. చల్లగా చినుకులు పడే వేళ బాల్కనీలో కుండీల్లో మనం పెంచుకుంటున్న మొక్కల మధ్య కూర్చుని కబుర్లు చెప్పుకోడం, కాఫీ తాగడం చాలా బావుంటాయి. అయితే, ఈ వీటితో పాటూ హోం గార్డెన్ పెంచుకునే వారు ఈ మాన్సూన్ టైం లో మొక్కల కోసం చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అప్పుడే కుండీల్లో మొక్కలు కళకళలాడుతూ ఉంటాయి. వానాకాలం లో మన ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.

Also Read : అన్‌వాంటెడ్ హెయిర్‌ని ఇలా రిమూవ్ చేయకపోతే కష్టమే..

చిన్న పిల్లల పట్లో తీసుకునేంత జాగ్రత్తనే మొక్కల పట్ల కూడా తీసుకోవాలని ప్లాంట్ లవర్స్ అందరికీ తెలుసు. మాన్సూన్ లో ఈ కేర్ ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వానా కాలం లో కుండీల్లో నీరు నిలిచిపోతుంది. హోం గార్డెన్ పట్ల ఆసక్తి ఉన్న వారు ఈ టిప్స్ పాటిస్తే మొక్కలు ఆరోగ్యం గా ఉంటాయి.

iStock-1187089571

* కుండీ ఎక్కడ పెడుతున్నాము అన్నది జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. మాన్సూన్ టైం లో వాన ఎప్పుడు పడుతుందో తెలీదు. ఉన్నట్టుండి పెద్ద వర్షం మొదలైపోతుంది. ఇలాంటి వాన తగిలే ప్రదేశంలో కుండీ ఉన్నట్టైతే మీరు కుండీ ప్లేస్ మార్చాలి. ఎక్కువ సూర్య రశ్మి, తక్కువ వాన పడే చోట కి ఆ కుండీని చేర్చాలి.

Also Read : గుండె సమస్యలున్నవారికి కరోనా వస్తే కోలుకుంటారా..

* మొక్కలు పెంచే అందరికీ ఇది తెలిసిన విషయమే. ఏ కాలంలో అయినా చెయ్యాల్సిన పనే. కుండీలో ఉన్న మట్టిని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. లేకపోతే మట్టి దగ్గరగా వచ్చేసి నీరు కిందకి వేర్ల వరకూ చేరుకోదు.

* మాన్సూన్ టైం లో క్రిమి కీటకాలు ఎక్కువ ఉంటాయి. అవి మొక్కల మీద ఉండి ఆకుల్ని తినేసి మొక్కకి హాని చేయకుండా చూసుకోవాలి. వానపాములు తప్ప అన్ని పురుగుల్నీ తీసేస్తూ ఉండాలి. మనం చిన్నప్పుడు సైన్స్ క్లాస్ లో నేర్చుకున్నట్టు వానపాములు మట్టికి మేలు చేస్తాయి.

* మొక్కలకి వేసవి కాలం లో కావాల్సినంత నీరు వానా కాలం లో అక్కర్లేదు. నీరు ఎక్కువైతే మొక్క చనిపోతుంది. మట్టి ఎండిపోయినట్లు కనబడినా, మొక్కల ఆకులు వాడిపోబోతూ ఉన్నా నీరు పోయండి.

Also Read : ఇంట్లోనే బాదం క్రీమ్ తయారుచేసుకోవడం ఎలా?

* చిన్న మొక్కలూ, తీగలని ఈ కాలం లో ఇంకా కేర్ఫుల్ గా చూసుకోవాలి. వాన తో పాటూ ఒక్కోసారి పెద్ద గాలి కూడా వస్తూ ఉంటుంది. తీగెలు పడిపోయి, డెలికేట్ గా ఉండే మొక్కలు వంగిపోయి, వాటిని తరువాత సర్దడం కష్టమౌతుంది. ఈ మొక్కలకి చిన్న చిన్న కర్రలతో కానీ, తాళ్ళతో కానీ సపోర్ట్ ఇస్తే గాలీ వానకి అవి తట్టుకుని నిలబడతాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *