Home Remedies for Acidity : అసిడిటీగా ఉన్నప్పుడు లవంగాలతో ఇలా చేయండి.. ఇట్టే సమస్య తగ్గిపోతుంది.. – amazing and effective home remedies for acidity problems


అసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇలా అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య వచ్చిదంటే చాలు.. దీనికి తోడు అనేక సమస్యలన్ని మనల్ని చుట్టుముడతాయి. అందుకే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. వీటిని వాడడం వల్ల ఇతర సమస్యలు ఏవి కూడా రావు. పైగా ఇవి అందరికీ అందుబాటులో ఇంట్లోనే ఉంటాయి. వీటిని వాడితే త్వరగా సమస్య తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకోండి..


Also Read : శృంగార సమస్యలు ఉన్నాయా.. అయితే ఈ పండు తినండి..

అసిడిటీగా అనిపించినప్పుడు నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పుదీనా కూడా ఈ సమస్యలని దరి చేరనివ్వకుండా ఉంచుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే నీటిలో కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచాలి. ఆ తర్వాత అందులో తేనె కలపాలి. ఇలా రెగ్యులర్‌గా తాగుతుంటే త్వరగానే సమస్య తగ్గిపోతుంది. అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా అల్లం రసం కూడా కలపొచ్చు. లేదా.. పుదీనా వేసినప్పుడే అల్లం ముక్కని వేసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది.

Also Read : వాటర్ బాటిల్స్‌తో చేసే ఎక్సర్‌సైజెస్ గురించి మీకు తెలుసా..

ఇక ఇదే కాకుండా జీలకర్ర సమస్యని పరిష్కరిస్తుంది.. నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని అలా అయినా తాగొచ్చు. అలా తాగలేని వారు నీటిని వడకట్టి తాగేయొచ్చు. ఇలా చేయడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుంది. అదే విధంగా.. తిన్న వెంటనే అల్లం ముక్కని నోట్లో వేసుకుని వచ్చే రసంని మింగుతూ ఉంటే సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది.


లవంగాలు..


ఇక ఈ అసిడిటే సమస్యకి లవంగాలు కూడా మంచి పరిష్కారం చూపుతుంది. లవంగాలను నోట్లో వేసుకుని ఆ రసంని మింగుతుంటే త్వరగా సమస్య తగ్గుతుంది. ఇది త్వరగా పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ టిప్‌ని పాటించడం వల్ల సమస్య తగ్గిపోతుంది.

అదే విధంగా.. సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు కొన్ని చిట్కాలు పాటించాలి.. రెగ్యులర్‌గా వీటిని పాటించడం వల్ల సమస్య త్వరగా తగ్గిపోతుంది.

ముందుగా ఈ సమస్యతో బాధపడేవారు నీటిని ఎక్కువగా తాగాలి. వీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దరికి చేరవు. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుోవాలి. అదే విధంగా ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని పాటించడం వల్ల సమస్య చాలా త్వరగా తగ్గుతుంది.

బేకింగ్ పౌడర్ నిమ్మరసం మిశ్రమం :


జీర్ణసమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ వసంత లాడ్ సూచించిన మరో సులభమైన గృహ చిట్కా నివారణ ఏమిటంటే, 1 టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటితో కలిపి సేవించడం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు.

అసిడిటీ సమస్య కారణంగా వచ్చే సమస్యలు..


అసిడిటీ కారణంగా అనేక సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం వారి జీవనశైలి అని చెప్పొచ్చు. ఈ సమస్య వచ్చిందంటే.. తిన్న వెంటనే ఆకలివేస్తుంటుంది. కొంచెం తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. ఛాతి, గొంతులో మంటగా ఉంటుంది. పుల్లటి తేన్పులు వస్తుంటాయి. ఇలా అనిపిస్తుంటే మనం మిగతా పనుల మీద ఆసక్తి చూపలేం. కాబట్టి.. దీనిని తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాలు పాటించడం వల్ల సమస్య త్వరగా సమస్య తగ్గిపోతుంది..

Also Read : ఈ లిక్విడ్ వేసి ఇంటిని తుడిస్తే వైరస్‌లన్నీ మాయం..

నేటి కాలంలో చాలా మంది గ్యాస్ ప్రాబ్లెమ్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పొచ్చు. ఈ సమస్య ఒక్కోసారి బాధాకరమైనదిగా లేదా తేలికపాటిదిగా కూడా ఉండొచ్చు. ఆహారం తీసుకున్న కాసేపటికే ఆకలి వేయడం, కొంచెం తినగానే కడుపు నిండినట్లుండటం, ఛాతిలో నొప్పిగా అనిపించడం, గొంతులో మంటగా ఉండి, పుల్లటి తేన్పులు రావడం.. ఇవన్నీ గ్యాస్‌ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలే. అయితే దీని తగ్గించుకోవడం కోసం ఏవేవో మందులు మింగేస్తుంటారు. కాని, ఈ సమస్యకు సింపుల్ టిప్స్‌తోనే చెక్ పెట్టవచ్చు.

ఇక గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంటే.. ఒకటి, రెండు లవంగాలను నోట్లో వేసుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా, ఒక బౌల్‌లో కొద్దిగా నీటిని తీసుకుని జీలకర్ర నాలుగు టీస్పూన్లు వేసి నీటిని బాగా మరిగించి తర్వాత నీటిని వడకట్టి వేడిగా ఉంగానే తాగేయాలి. దీంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. మరియు భోజనం చేసిన తర్వాత చిన్న మొత్తంలో తాజా అల్లాన్ని నమలితే గ్యాస్ ప్రాబ్లెమ్‌కు సులువుగా చెక్ పెట్టవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *