homemade facepack: ఈ ఫేస్ ప్యాక్‌తో వేస్తే ఒక్క మచ్చ కూడా ఉండదు.. – homemade face pack for clear and spotless skin know here all details


మంచి చర్మం కలిగి ఉండటం అనేది కేవలం DNA కి సంబంధించినది కాదు మీ రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు చదివిన కొన్ని ప్రొడక్ట్స్ యొక్క రివ్యూలు, మీరు సంప్రదించిన వైద్యులను బట్టి, మీ చర్మ సంరక్షణకు ఏయే ప్రొడక్ట్స్ వాడాలి. మీ చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే దానిపై చాలా అభిప్రాయాలు ఏర్పడతాయి. అంతిమంగా, మీ చర్మాన్ని చూసుకోవడం కేవలం వ్యక్తిగతమైనవి. మీ చర్మ సంరక్షణకు మీరు చేయవలసిందల్లా మంచి ఆహారం తీసుకుని, కెమికల్స్ లేని, ఆయుర్వేద ఫేస్‌ప్యాక్ లను ఉపయోగించండి.

కెమికల్ ఫ్రీ మేక్ఓవర్ కోసం మీరు ఇంట్లో తయారు చేయగల రెండు సహజసిద్ద ఫేస్ ప్యాక్‌లను ఇప్పుడు చూద్దాం.

Also Read : ఈ రాశి వారిని పెళ్ళి చేసుకుంటే ఎలాంటి గొడవలు రావట..

డిటాక్స్ ఫేస్ మాస్క్

మీ చర్మం ఫ్రెష్ గా ఉండటానికి మరియు మెరిసే చర్మం పొందడానికి, నిపుణులు డిటాక్స్ ఫేస్ మాస్క్‌ను సిఫారసు చేస్తున్నారు.

కావలిసిన పదార్థాలు:

 • అర టీ స్పూన్ – పసుపు
 • ఒక టీ స్పూన్ – వేపాకు పొడి
 • ఒక టీ స్పూన్ – మునగాకు పొడి
 • ఒక టీ స్పూన్ – అతిమధుర పొడి
 • ఒక టీ స్పూన్ – మంజిష్ఠ
 • మూడు టీ స్పూన్లు – ముల్తానీ మట్టి
 • ఒక టీ స్పూన్ – తేనె
 • 2-3 టీ స్పూన్లు – పాలు మరియు నీళ్ళు

తయారీ విధానం:

అన్ని పదార్థాలను బాగా కలపండి. తరువాత ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ బాగా ఎండి పగలడం మొదలైన తరువాత దాన్ని తీసెయ్యండి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే అది మీ చర్మంలోని తేమను తీసివేస్తుంది కాబట్టి త్వరగా తీసెయ్యండి.

Also Read : పెళ్ళి వద్దంటున్న చెల్లికోసం అన్నయ్య ఏం చేశాడంటే..

మొటిమల నివారణకు మాస్క్..

మొటిమలతో బాధపడే టీనేజర్లు కెమికల్స్‌తో నిండిన ఉత్పత్తులను పక్కన పెట్టి, ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు.

కావలిసిన పదార్థాలు:

 • ఒక టీ స్పూన్ – పసుపు
 • ఒక టీ స్పూన్ – వేపాకు పొడి
 • 2 టీ స్పూన్లు – ముల్తానీ మట్టి
 • అర టీ స్పూన్ – మంజిష్ఠ
 • 3-4 టీ స్పూన్లు – పాలు
 • ఒక టీ స్పూన్ – నీళ్ళు

తయారీ విధానం:

ఒక గిన్నెలో అన్ని పదార్థాలను తీసుకుని బాగా కలపండి. దాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో ముంచిన రుమాలుతో తుడవాలి. మంచి ఫలితాల కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 3,4 సార్లు వాడండి.

“ఈ చిట్కాల్లో సహజమైన పదార్ధాలను ఉపయోగించినప్పటికీ, మీకు ఏదైనా పదార్ధం అలెర్జీ కలిగిస్తుందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది. అందువల్ల, ఈ చిట్కాలను ప్రయత్నించే ముందు మీ చేతిపై లేదా తొడలపై ప్యాచ్ టెస్ట్ చేయండి.” అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : పాలు తాగితే కాన్సర్ రాదా..

ప్రస్తుత రోజుల్లో మహిళలు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేది మెరిసే చర్మానికే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మృదువైన, సున్నితమైన, మరియు మచ్చలులేని మెరిసే చర్మం కోసం ఆరాటపడుతున్నారు. మనలో ప్రతి ఒక్కరూ బిజీ షెడ్యూల్, క్రమరహిత ఆహారపు అలవాట్లు, సరిపడనంత నిద్ర, కాలుష్యం వంటి వాటి వల్ల మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని సాధించడం కష్టంగా ఉంది. కానీ అది అసాధ్యం కాదు. అందం మరియు చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు ఏవైనా సహజసిద్ధమైన ఉత్పత్తులకు సాటిరావు. కాబట్టి, ప్రకాశవంతమైన, మెరిసే చర్మం కోసం మీ వంటగదిలోని పదార్ధాలతో సులభంగా ఈ చిట్కాలను తయారు చేసుకుని ఉపయోగించి చూడండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *