how to get pregnant easy: రోజులో ఎన్ని సార్లు పాల్గొంటే ప్రెగ్నెంట్ అవుతారు.. – how to get pregnant fast and easy


ఒక అధ్యయనం ప్రకారం 1194 మంది తల్లితండ్రుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తే అందులో చాలా మంది నెలలో 13 సార్లు శృంగారంలో పాల్గొన్నారు. ఇది సరదాగానే ఉన్నా గర్భధారణ మీదే ధ్యాస ఉండడంతో, వీరు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది పిల్లలకోసం సెక్స్ లో పాల్గొనటం ఒక పెద్ద పనిలా ఉందని కూడా అన్నారు. నిపుణుల సలహా ప్రకారం, బేబీ గురించి కంటే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తే ఆందోళన తగ్గుతుంది.

​ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే..

samayam telugu

1. కొంతమంది మ్యారేజ్ అయిన వెంటనే గర్భం ధరించినా, మరికొంతమందికి మాత్రం చాలా సమయం పట్టొచ్చు. ఒక అధ్యయనం ప్రకారం మీరెంత తరచుగా శృంగారంలో పాల్గొంటున్నారన్నదానికీ, మీ గర్భధారణ అవకాశాలకీ సంబంధం ఉంది అని తేలింది. దీంతో పిల్లలు కావాలనుకునే దంపతులు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మీరు చేసే ప్రతి పని కూడా గర్భధారణకి ముడిపడి ఉంటుందని చెబుతున్నారు.

Also Read: ఈజీగా ఇంట్లోనే చేసే ఈ వర్కవుట్స్‌తో త్వరగా బరువు తగ్గొచ్చు..

​2. అధ్యయనం ప్రకారం..

samayam telugu

గర్భధారణ కోసం ప్రయత్నం మొదలుపెట్టినప్పట్నించీ, గర్భం ధరించేవరకూ, జంటలు సుమారుగా 78 సార్లు శృంగారంలో పాల్గొంటారు. ఈ 78 సార్లు సుమారుగా 158 రోజులు గానీ, ఆరు నెలలు గానీ పట్టొచ్చు. ఈ అధ్యయనాలను కొంతమంది పరిశోధకులు అనేక సంవత్సరాలుగా కొన్ని జంటల మీద చేశారు. ఈ పరిశోధనల్లో ఆశ్చర్యపరిచే విషయాలు తెలిశాయి.

​3. ది బెస్ట్ పొజిషన్

samayam telugu

కొంతమంది సెక్స్ లో పాల్గొనే పొజిషన్ ని బట్టి కూడా గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయని అంటారు. మూడొంతుల మంది మిషనరీ పొజిషన్‌ని ఫాలో అవుతుంటే, మిగిలిన వారు డాగీ స్టైల్ ని ఫాలో అవుతున్నారు. నిపుణుల సలహా ప్రకారం, పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు రోజులో ఒకసారి కంటే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనకూడదు. ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనటం వల్ల గర్భం ధరించే అవకాశాలెక్కువుంటాయని భావిస్తారు గానీ, దానివల్ల హెల్తీ స్పెర్మ్ సంఖ్య తగ్గుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు రోజులకి ఒకసారి సెక్స్ లో పాల్గొనేవారికి గర్భధారణ అవకాశాలెక్కువగా ఉంటాయి.

Also Read: ఆఫీస్‌కి వెళ్లే ముందు ఇలా చేస్తే ఎక్కువ జీతం వస్తుందట..

​4. నెలలో ఏది సరైన సమయం?

samayam telugu

నెలలో కొన్ని రోజులలోనే స్త్రీ శరీరం గర్భం ధరించడానికి అనువుగా ఉంటుంది. ఇవి ఓవులేషన్ జరగడానికి ఐదు రోజుల ముందు నుంచి, ఓవులేషన్ జరిగే రోజు వరకూ. ఓవులేషన్ జరిగే రెండు రోజుల లోనూ గర్భధారణకు చాలా అనువుగా ఉంటుంది. ఈ రోజుల్లో సెక్స్ లో పాల్గొనటం వల్ల మీ ప్రయత్నం ఫలించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ రోజుల్లో కచ్చితంగా కలయిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి..

​5. ఓవులేషన్

samayam telugu

ఓవులేషన్ టైమ్‌లో మీ ఓవరీ పరిపక్వమైన ఎగ్‌ని ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భసంచి కి పంపిస్తుంది. స్త్రీ శరీరంలో స్పెర్మ్ ఐదు రోజులు ఉంటుంది. కాబట్టి, ఓవులేషన్ జరిగే సమయానికి స్త్రీ ఫాలోపియన్ ట్యూబ్స్ లో స్పెర్మ్ ఉండేటట్లు చూస్కోవాలి. ఈ జాగ్రత్తలు పిల్లలకోసం ప్రయత్నించే దంపతులు పాటించాలి. అప్పుడే వారికి అనుకున్న ఫలితాలు వస్తాయి.

Also Read: ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ గొడవలేనట..

​6. ఓవులేషన్ జరుగుతోందని ఎలా తెలుస్తుంది?

samayam telugu

మీరు ఒక యాప్‌లో గానీ, క్యాలెండర్ లో గానీ మీ ఋతుక్రమాన్ని నోట్ చేస్తూ ఉండండి. మీ పీరియడ్ మొదలైన రోజునుంచి తరువాత పీరియడ్ ముందు రోజు వరకూ ఒక సైకిల్ లా తీసుకోండి. ఈ సైకిల్ లో మధ్య రోజులని గుర్తించండి. మీకు ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ ఉంటే సుమారుగా పద్నాలుగో రోజున మీకు ఓవులేషన్ జరుగుతుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *