hyderabad woman grab police collar : పోలీసు కాలర్ పట్టిన తల్లీకొడుకులు, మౌలాలీలో షాకింగ్ ఘటన – woman and her son grabs police collar at moula ali, hyderabad


లాక్‌డౌన్ వేళ పోలీసులు, రోడ్డు ఎక్కిన వారి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మౌలాలీలో ఓ మహిళ పోలీసు కాలర్ పట్టుకుంది.

Ravi Kumar |
Samayam Telugu | Updated:

X

పోలీసు కాలర్ పట్టిన తల్లీకొడుకులు

లాక్‌డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చే వారు, పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు దాడి చేయగా.. మరి కొన్ని చోట్ల పోలీసులపై జనాలు తిరగబడుతున్నారు. వనపర్తి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో కొద్దిపాటి వీడియో మాత్రమే బయటకు వచ్చిందని.. ఆ వ్యక్తి తప్పు కూడా ఉందనే విషయాన్ని కొందరు సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరిధిలోని మౌలాలీలో మరో ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు, అతడి తల్లి పోలీసుల కాలర్ పట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. కాగా.. తనను లం* కొ*క అని పోలీసు దూషించాడని దీంతో అమ్మతో కలిసి తాను అతడి కాలర్ పట్టుకున్నామని యువకుడు చెబుతున్నాడు.

పోలీసు కాలర్ పట్టుకోవడం యువకుడు, అతడి తల్లి చేసిన తప్పయితే.. అతణ్ని దూషించడం పోలీసు చేసిన తప్పు. వీడియోలోనూ పోలీసులు అతణ్ని దూషించడం క్లియర్‌గా వినిపించింది.

In Videos: పోలీసు కాలర్ పట్టిన తల్లీకొడుకులు

 

Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Web Title shocking incident: woman and her son grab police man collar who allegedly used abusive language

(Telugu News from Samayam Telugu , TIL Network)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *