ian bishop’s odi team: బిషప్ దశాబ్దాపు వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీ.. మరో ఇద్దరికీ ఛాన్స్ – ms dhoni, virat kohli and rohit sharma feature in ian bishop’s odi xi of the decade


వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్‌ ఎంపిక చేసిన దశాబ్దాపు వన్డే జట్టు కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీ ఎంపికయ్యాడు. తన జట్టులో మొత్తం ముగ్గురు భారత క్రికెటర్లకి అవకాశమిచ్చిన బిషప్.. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాని మాత్రం పక్కన పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? ఆ జట్టులో కనీసం ఒక్క వెస్టిండీస్ క్రికెటర్‌, ఇంగ్లాండ్, పాకిస్థాన్ క్రికెటర్‌కి కూడా చోటు దక్కలేదు.

Read More: టీ20 వరల్డ్‌కప్ 2022కి వాయిదా..? ఐపీఎల్ 2020‌కి లైన్ క్లియర్

ఇయాన్ బిషప్ దశాబ్దాపు వన్డే జట్టు ఇదే: రోహిత్ శర్మ (భారత్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్), షకీమ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)

Read More: ఫైనల్లో సచిన్ ఔట్‌కి ధోనీ ప్లాన్: మాజీ స్పిన్నర్ జకాతి

2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఎంపిక చేసిన బిషప్.. అతనికి జోడీగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ని సెలెక్ట్ చేశాడు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఏబీ డివిలియర్స్, రాస్‌టేలర్‌తో మిడిలార్డర్‌ని సమతూకంగా ఉంచుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో షకీమ్ ఎంపికవగా.. కీపర్, కెప్టెన్‌గా ధోనీ ఏడో స్థానంలో టీమ్‌లో‌‌‌కి సెలక్ట్‌ అయ్యాడు. బౌలింగ్ విభాగాన్ని మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్, లసిత్ మలింగాతో నింపేసిన బిషప్.. ప్రొఫెషనల్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి స్పిన్ బాధ్యతలు అప్పగించాడు. షకీబ్ కూడా స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *