immunity boosting tips: కూరల్లో ఇవి వేసి వండితే ఇమ్యూనిటీ దానంతట అదే పెరుగుతుంది.. – effective tips to strengthen your immunity naturally


మాన్సూన్స్ వచ్చేశాయి. చిరు జల్లుల్లో వేసవి తాపాన్ని మరిచిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ, వాన తో పాటూ బాక్టీరియల్ ఇంఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. వాటి నించి తప్పించుకోవాలంటే మనకి ఉన్న ఏకైక మార్గం న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోడమే. మన ఇమ్యూనిటీని పెంచి మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే ఫుడ్స్ చాలానే ఉన్నాయి. తీసుకునే ఫుడ్ లో కొన్ని ఛేంజెస్ చేసుకోవడం ద్వారా మాన్సూన్ టైం ని మంచి హెల్త్ తో ఎంజాయ్ చేయవచ్చు. అవేమిటో చూడండి.

​1. విటమిన్ సీ ఫుడ్ తీసుకోండి

విటమిన్ సీ ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది. ఎర్ర కాప్సికం, బొప్పాయి, నిమ్మకాయ, టొమాటో వంటివి విటమిన్ సీ తో సమృద్ధమైనవి. రోజులో కనీసం ఒకసారైనా వీటితో చేసిన ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ ని స్ట్రాంగ్ గా ఉంచుకోగలుగుతాం.

Also Read : అన్‌వాంటెడ్ హెయిర్‌ని ఇలా రిమూవ్ చేయకపోతే కష్టమే..

​2. బయట తినొద్దు

ఎప్పుడు తిన్నా పరవాలేదు కానీ, వానా కాలం లో మాత్రం బైట తినకూడదు. ఈ వెదర్ అందుకు మంచిది కాదు. ఇంటి భోజనమే, అంతే. లైట్ గా తిందామనుకుంటే సింపుల్ గా కిచిడీ చేసుకోండి, సరిపోతుంది. మీకు కావాలనుకుంటే, రైస్ కి బదులుగా చిరు ధాన్యాలు తీసుకోవచ్చు. వీటి వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది.

Also Read : ఇమ్యూనిటీ పెరగాలా.. ఈ పండు తినండి చాలు..

​3. స్పైస్ వాడండి

అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి దినుసులు ఇమ్యూన్ సిస్టం బాగా పని చేసేలా చేస్తాయి. మీ కూరల్లో, పులుసుల్లో ఇవి వేసుకోండి. లేదా వీటిని వాడి చేసే టీ తాగండి. లేదా పరగడుపున నిమ్మకాయ నీళ్ళల్లో కొంచేం అల్లం ముక్కలుగా చేసి వేసుకుని తాగండి. ఎలా వాడతారో మీ ఇష్టం. కానీ, ఇవి వాడడం మాత్రం మంచిది.

​4. నీరు ఎక్కువగా తీసుకోండి

వాతావరణం కొంచెం చల్లబడగానే అందరం చేసే తప్పు ఏమిటంటే నీరు సరిగ్గా తాగకపోవడం. ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీలో నీరు ఎక్కువ తాగాలి. దాహం గా అనిపించకపోయినా తాగాలి. నీటి తో పాటూ జ్యూసులూ, మజ్జిగా, కొబ్బరి నీరూ వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Also Read : ఫేస్ మాస్క్ ఒక్కటే వాడితే కరోనా నుంచి తప్పించుకోవచ్చా..

​5. వండినవే తినండి

ఈ సీజన్ లో వీలున్నంత వరకూ పూర్తిగా ఉడికించిన కూరగాయలనే తీసుకోండి. పచ్చి వాటిని బాక్టీరియా పట్టుకుని ఉండే అవకాశం ఉంది. అలాగే తొక్క తీసి తినే పండ్లని ప్రిఫర్ చేయండి. అరటి పండ్లు, పుచ్చకాయ, బత్తాయిలు, లిచీ వంటివి మంచి ఆప్షన్స్. ఈ మాన్సూన్ స్పెషల్ డైట్ తో మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *